గడచిన రెండు మూడు రోజుల నుండి సోషల్, వెబ్ మీడియాలో అక్కినేని నాగార్జునకు తీవ్ర అస్వస్థతగా ఉందని వార్తలు వచ్చాయి. బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్లలో నాగార్జున ఉత్సాహంగానే కనిపించారు. అయినప్పటికీ ఈ వార్తలు మాత్రం ఆగలేదు. నాగార్జునకు తీవ్ర అస్వస్థతగా ఉండటంతో బిగ్ బాస్ షోకు కూడా హోస్ట్ మారబోతున్నాడని వార్తలు వినిపించాయి. తనపై ఇలాంటి వార్తలు రావటంతో నాగార్జున తన సన్నిహితుల ద్వారా అభిమానులకు ఒక సందేశాన్ని పంపాడని సమాచారం. 
 
ఈ సందేశం ప్రకారం నాగార్జున ప్రస్తుతం వైరల్ ఫీవర్ తో భాద పడుతున్న మాట వాస్తవమే. ఈ ఫీవర్ ఫ్యాన్స్ కంగారు పడేంత ఫీవర్ కాదు. నాగార్జునకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు. నాగార్జున ఆరోగ్యం గురించి అనవసరమైన రూమర్లను క్రియేట్ చేయవద్దని సందేశం యొక్క సారాంశం. అక్కినేని నాగార్జున ఆరోగ్యం గురించి టెన్షన్ పడుతున్న ఫ్యాన్స్ కు ఈ వార్త బయటికి రావటం వలన ఇక ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. 
 
నాగార్జున ప్రస్తుతం బిగ్ బాస్ షో హోస్ట్ చేస్తున్నాడు. నాగార్జున వచ్చే వీకెండ్ ఎపిసోడ్లకు మంచి టీఆర్పీ రేటింగ్ వస్తున్నట్లు సమాచారం. ఈ నెలలో నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన మన్మథుడు2 సినిమా విడుదలైంది. నాగార్జున కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్టైన మన్మథుడు సినిమా పేరుతో రావటంతో అభిమానులు ఈ సినిమాపై భారీగా అంచనాలు పెంచుకున్నారు. కానీ ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకోవటంతో నామమాత్రపు వసూళ్ళు మాత్రమే వచ్చాయి. 
 
బిగ్ బాస్ షో పూర్తయిన తరువాత నాగార్జున సోగ్గాడే చిన్నినాయన సీక్వెల్ బంగార్రాజు సినిమాలో నటించబోతున్నాడు. సోగ్గాడే చిన్నినాయన సినిమాకు కొనసాగింపుగా ఈ సినిమా ఉండబోతుంది. ఈ సినిమాలో నాగార్జునతో పాటు నాగచైతన్య కూడా నటించబోతున్నాడు. నాగచైతన్యకు జోడీగా కీర్తీ సురేశ్ నటించబోతున్నట్లు సమాచారం అందుతుంది. కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: