తెలుగు బుల్లితెర మీద విపరీతమైన పాపులారిటీ తెచ్చుకున్న కామెడీ షో "జబర్దస్త్" ఈ షో ద్వారా ఎందరో కమెడియన్లు బయటకి వచ్చారు. ఈ షో కి పోటీగా ఎన్నో షోలు వచ్చినప్పటికీ అవేవీ నిలబడలేకపోయాయి. జబర్దస్త్ షో ద్వారా వచ్చి సినిమాలు చేస్తున్న వారిలో షేకింగ్ శేషు కూడా ఒకరు. ఈ యన సుప్రీమ్, రంగస్థలం చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. రంగస్థలంలో శేషు వేసిన పాత్రకి విమర్శకుల నుండి ప్రశంసలు దక్కాయి.


అయితే శేషు తన సినీ జీవిత ప్రయాణాన్ని గురించి, జబర్దస్త్ గురించి చెబుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా వెల్లడించాడు. జబర్దస్త్ సెట్ లో ఆయన్ని అందరూ డాడీ, బాబాయ్ అని పిలుస్తారని, తన వయసుకి గౌరవమిచ్చి మర్యాదపూర్వకంగా ఉంటారని చెప్పుకొచ్చాడు.కేవలం కళాకారులే కాదు.. జడ్జ్‌లు రోజా గారు, నాగబాబు గారు మిగిలిన వాళ్లందరూ నాతో మంచిగానే ఉంటారు' అని ఆయన చెప్పుకొచ్చారు.


నాకు జబర్ధస్త్‌ వల్లే మంచి గుర్తింపు వచ్చింది. అక్కడ నా ప్రదర్శన చూసిన తర్వాతే చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కొందరైతే నా స్కిట్లు చూసిన తర్వాతే చాలా మంది అవకాశాలు ఇస్తామని పిలిచారు. సాయి ధరమ్ తేజ్ ‘సుప్రీమ్' సినిమాలో ఛాన్స్ కూడా అలాగే వచ్చింది. ఎన్ని సినిమాలు చేసినా జబర్దస్త్‌లో పెట్టిన షేకింగ్ శేషు అంటేనే నన్ను గుర్తు పడతారు. అందుకే జబర్దస్త్ ఎప్పటికి నాకు గౌరవమే అని చెప్పుకొచ్చాడు.


సినిమాల్లో అవకాశాల కోసం ఎంతగానో తిరిగానని,  ‘అవకాశం రాలేదని చచ్చిపోవాలని అనిపించిన క్షణాలు బోలెడు ఉన్నాయని అన్నాడు. నటించడం కోసమే ఇండస్ట్రీకి వచ్చిన వాడికి మంచి డైరెక్టర్ సినిమాలో అవకాశం రాకపోతే ఏం చేయాలి.? సంసారాన్ని పోషించలేని వాడు ఆత్మహత్య చేసుకుంటున్నట్లే. సినిమాల్లో అవకాశాలు రాని వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నటుడు ఉదయ్ కిరణ్ కూడా అవకాశాలు రాకపోవడం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: