సినిమా హీరోలను ఆరాధించడం అనేది పలు దశాబ్దాల నుండి మన దేశంలో జరుగుతూ వస్తున్న అంశమే. అయితే మన సౌత్ సినిమా ఇండస్ట్రీలో మాత్రం, అది మరింత ఎక్కువగా కనపడుతుంది. ఇక్కడ ఒకరకంగా హీరోని దేవుడిలా ఆరాధించేవారు అత్యధికులు అని చెప్పక తప్పదు. ఇక వారి వారి హీరోల సినిమాలు రిలీజ్ అవుతుంటే, సదరు అభిమానులు చేసే హడావుడి, అలానే తమ అభిమాన హీరో సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు టికెట్స్ కోసం వారు పడే కష్టాలు అనన్యసామాన్యం అనే చెప్పాలి. ఇక మన తెలుగు హీరోలకు ఉన్న అభిమానులు కూడా మా హీరో గొప్ప అంటే మా హీరోలు గొప్ప అని వాదించుకోవడం తరచూ జరుగుతూనే ఉంటుంది. 

అయితే అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో సినిమా విషయంలో మాత్రం అందరు హీరోలు ఒక్కటైనట్లు తెలుస్తోంది. తెలుగు సినిమా ఖ్యాతిని జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన బాహుబలి రెండు భాగాల సినిమాల తరువాత, పాన్ ఇండియా అపీల్ తో విదేశాల్లో కూడా విపరీతమైన క్రేజ్ సంపాదించిన సాహో మూవీ మంచి సక్సెస్ సాధించి, మన తెలుగు సినిమా ఖ్యాతిని మరింతగా పెంచాలని కోరుకుంటూ ఇప్పటికే మెగాఫ్యాన్స్, సూపర్ స్టార్ ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్, అక్కినేని, దగ్గుబాటి ఫ్యాన్స్ తదితరులు, రెబల్ స్టార్ ఫ్యాన్స్ కు తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అల్ ది అంటూ విష్ చేయడం గమనించవచ్చని అంటున్నారు. మనలో మనం ఎంతైనా గొడవపడవచ్చు, 

కానీ మన తెలుగు వారి కీర్తి ప్రతిష్టలు పెంచే స్థాయిలో అత్యున్నతంగా తెరకెక్కిన సాహో విజయవంతం అవ్వాలని, అలానే దానిబాటలో రాబోయే రోజుల్లో మరిన్ని తెలుగు సినిమాలు రూపొంది, ఆ విధంగానే సక్సెస్ సాదించాలి అనేది ఎక్కువ మంది ఫ్యాన్స్ కోరుకుంటున్న భావన. అయితే ఈ విధంగా సాహో సినిమా ద్వారా టాలీవుడ్ లోని అందరు హీరోల అభిమానులు ఒక్కటైన సందర్భం గురించి వింటుంటే ఎంతో ఆనందంగా ఉందని, రాబోయే రోజుల్లో ఆ విధంగా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మరింత ఆరోగ్యకర పరిస్థితులు రావాలని కోరుకుంటున్నట్లు పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: