వరుణ్ తేజ్ హరీశ్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా వాల్మీకి. ముందుగా ఈ సినిమాను సెప్టెంబర్ 6 వ తేదీన విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. కానీ సాహో సినిమా రిలీజ్ డేట్ ఆగస్ట్ 30 వ తేదీకి మార్చుకోవటంతో వాల్మీకి సినిమాను సెప్టెంబర్ 13 కు వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కానీ సాహో రిలీజ్ డేట్ వాయిదా పడటం వలన అదే రోజు రిలీజ్ కావాల్సిన  నాని గ్యాంగ్ లీడర్ సినిమా రిలీజ్ డేట్ కూడా సెప్టెంబర్ 13 వ తేదీకి వాయిదా వేసారు. 
 
వరుణ్ తేజ్, నాని ఇద్దరూ మిడిల్ రేంజ్ హీరోలు. ఇద్దరి సినిమాలు ఒకే రోజు విడుదలైతే రెండు సినిమాలు కలెక్షన్లు నష్టపోయే అవకాశం ఉంది. అందువలన దిల్ రాజు మరికొందరు నిర్మాతలు కలిసి వాల్మీకి సినిమా మేకర్స్ ను సెప్టెంబర్ 20 వ తేదీన సినిమా విడుదలయ్యేలా ఒప్పించారు. కానీ వాల్మీకి వాయిదా పడటం వలన ఆ సినిమాకు జరిగే మేలు కంటే నష్టమే ఎక్కువ అని తెలుస్తోంది. వాల్మీకి సినిమా విడుదలయ్యేసరికి సాహో సినిమా ప్రభావం తగ్గిపోతుంది. 
 
కానీ కేవలం 12 రోజుల గ్యాప్ తో సైరా నరసింహారెడ్డి సినిమా విడుదల కాబోతుంది. వాల్మీకి, సైరా రెండూ మెగా ఫ్యామిలీ హీరోలకు చెందిన సినిమాలు. ఇద్దరు మెగా హీరోల సినిమాలు ఇంత తక్కువ గ్యాప్ లో రావటం మంచిది కాదనే అభిప్రాయం ట్రేడ్ విశ్లేషకుల నుండి వ్యక్తమవుతుంది. వాల్మీకి సినిమాకు హిట్ టాక్ వచ్చినప్పటికీ సైరా కోసం థియేటర్లు త్యాగం చేయక తప్పదు. కేవలం 12 రోజుల్లో ఈ సినిమా పెట్టిన బడ్జెట్ రికవరీ చేస్తుందా అంటే కష్టమే అని తెలుస్తుంది. 
 
వాల్మీకి సినిమా తమిళంలోని జిగర్తాండ రీమేక్. హరీష్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. హరీష్ శంకర్ ఈ సినిమాకు ఏడు కోట్ల రుపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఫిదా, తొలి ప్రేమ, ఎఫ్ 2 లాంటి హిట్లతో వరుణ్ కెరీర్లో వరుసగా హిట్లు కొడుతున్నాడు. ఈ సినిమాను 14 రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: