సాహో ఫీవర్ నార్త్ టు సౌత్ ఓ ఊపు ఊపేస్తోంది. ఈ సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేందుకు మ‌రో రెండు రోజుల టైం మాత్ర‌మే ఉంది. సాహో త‌ర్వాత సైరా ఉండ‌నే ఉంది. సైరా కూడా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేందుకు మ‌రో నెల రోజుల టైం మాత్ర‌మే ఉంది. సైరా ఫీవ‌ర్ కూడా బిజినెస్ ప‌రంగా స్టార్ట్ అయ్యింది. ఈ సినిమా హక్కుల కోసం పోటీ మొదలయింది. ఏపీలో కీల‌క‌మైన ఉత్త‌రాంధ్ర రైట్స్ విష‌యంలో ఓ డిస్ట్రిబ్యూట‌ర్‌కు రైట్స్ దాదాపు వెళ్లిపోయాయి అనుకున్న టైంలో దిల్ రాజు అడ్డం ప‌డిన‌ట్టు తెలుస్తోంది.


ఉత్తరాంధ్ర సైరా పంపిణీ హక్కుల కోసం సీనియర్ ఎగ్జిబిటర్ క్రాంతిరెడ్డి 14.5 కోట్ల ఎన్ఆర్ఎ (నాన్ రిట‌ర్న్ బుల్ అడ్వాన్స్‌) కింద దాదాపు ఓకే చేయించుకున్నారు. మెగాస్టార్ తొలినాళ్ల నుంచి ఆయ‌నతో మంచి అనుబంధం ఉంది. అయితే ఆయ‌న‌కు పోటీగా మ‌రో డిస్ట్రిబ్యూటర్ గాయత్రి ఫిలింస్ 13.5కోట్ల వరకు వెళ్లి ఆగిపోయింది. క్రాంతిరెడ్డికి వైజాగ్ ఏరియా రైట్స్ వెళ్లాయ‌నుకుంటున్న టైంలో దిల్ రాజు ఎంట్రీ అయ్యాడ‌ట‌.


ఉత్త‌రాంధ్ర‌లో ఆయ‌న‌కు మంచి డిస్ట్రిబ్యూష‌న్ నెట్ వ‌ర్క్ ఉంది. ఆయ‌న చేతిలో అక్క‌డ చాలా థియేట‌ర్లు కూడా ఉన్నాయి. ఇక సురేష్‌బాబు, అర‌వింద్ థియేట‌ర్లు కూడా ఆయ‌న తీసుకుంటారు. దీంతో ఆయ‌న రూ.15 కోట్లు ఆఫ‌ర్ చేసి చివ‌ర్లో అడ్డు త‌గిలార‌ట‌. దీంతో సైరా ఉత్త‌రాంధ్ర రైట్స్ ఇంకా పెండింగ్‌లో ప‌డ్డాయి. అవసరం అయితే 16కోట్లు ఇచ్చి అయినా సైరాను ఉత్తరాంధ్రలో తానే పంపిణీ చేయాలనే ఆలోచనలో దిల్ రాజు పట్టుదలగా ఉన్న‌ట్టు టాక్‌.


సైరాను ఇఫ్పటికే నైజాం 30 కోట్లకు దిల్ రాజు-యువి కలిపి తీసుకున్నారు. వెస్ట్ గోదావరికి ఉషా బాలకృష్ణ సంస్థ 9 కోట్లకు తీసుకున్నారు. సీడెడ్ ను ఎన్వీ ప్రసాద్ రూ.20 కోట్లు నాన్ రిట‌ర్న‌బుల్‌, మ‌రో రూ.2 కోట్లు రిట‌ర్న్‌బుల్‌కు తీసుకునేలా బేరాలు న‌డుస్తున్నాయి. ఏదేమైనా మ‌రి ఉత్త‌రాంధ్ర రైట్స్‌ను రామ్‌చ‌ర‌ణ్ రాజుకు ఇస్తాడా ?  లేదా ?  ముందు అనుకున్న‌ట్టుగా క్రాంతిరెడ్డికి ఇస్తాడా ? అన్న‌ది చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: