అత్యంత భారీ బ‌డ్జెట్ తో  హై స్టాండ‌ర్డ్స్ టెక్నాల‌జీతో ప్ర‌భాస్ హీరోగా  తెరెకెక్కిన్న   'సాహో' చిత్రం అగ‌ష్టు 30న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఏ స్టార్ సినిమాకైనా యూఎస్ లో ఒకరోజు ముందుగానే ప్రీమియర్ షోస్ వేయటం ఆనవాయితీ.   ఆ రకంగా స్టార్ హీరోల సినిమాలకు  భారీ ఓపెనింగ్స్ వస్తాయి. అప్పుడే కోట్లు పెట్టి కొనుకున్న  డిస్ట్రిబ్యూటర్లకు పెట్టిన డబ్బులు వెనక్కి వస్తాయి.  కానీ కొన్ని కారణాల వల్ల సాహో యూఎస్ ప్రీమియర్  షోస్ ను క్యాన్సల్ చేశారని ఇటివలే మేం రివీల్ చేశాం. అనుకున్నట్లుగానే యూఎస్ లో షోస్ క్యాన్సల్ చేశారు.  యూఎస్‌లో భారీ ఫాలోయింగ్ ఉన్న  ప్రభాస్.. ఇప్పుడు అదే యూఎస్ కి భయపడుతున్నాడు. అయినా   ప్రీమియర్స్ తో భారీ కలెక్షన్స్ ను రాబట్టుకోవచ్చు అని  ఆశలు పెట్టుకున్న  డిస్ట్రిబ్యూటర్లు  ప్రస్తుతం ఏమి అర్ధంకాక అయోమయ స్థితిలో ఉన్నారు.   నిజానికి సాహో యూఎస్ రైట్స్ ఎవరూ ఊహించని విధంగా భారీ మొత్తంలో డిస్ట్రిబ్యూటర్లు కొన్నారు.    


తీరా రిలీజ్ డేట్ దగ్గర పడే క్రమంలో ఇప్పుడు కలెక్షన్స్ ఎక్కువుగా వచ్చే ప్రీమియర్ లను రద్దు చేయడంతో అసలుకే మోసం వచ్చేలా ఉందని వారు కంగారు పడుతున్నారు.  అయితే ఈ షోస్ రద్దు అవ్వటానికి కారణం మాత్రం.. సాహో పై ఎక్కువుగా ఇంగ్లీష్ సినిమాల ప్రభావం ఉండటమేనని తెలుస్తోంది, దాంతో సినిమా పై నెగిటివ్ ప్రచారం వస్తుయిందని యూఎస్‌ లో ప్రీమియర్ షోస్ రద్దు చేసుకున్నారు.  అయితే సినీ ట్రేడ్ వర్గాలు మాత్రం  సాహో సినిమా పై విపరీతమైన అంచనాలు ఉన్నాయని,  పైగా యూఎస్‌లో ప్రభాస్ కి మంచి ఫాలోయింగ్ ఉందని డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన అమౌంట్ కంటే  ఎక్కువే వస్తోందని అంటున్నాయి.   కానీ  నిర్మాతలు మాత్రం ధైర్యం చేసే పరిస్థితి కనిపించట్లేదు.   కాగా ప్రస్తుతం సాహో  ప్రమోషన్స్ ను అన్ని భాషల్లో పెద్ద ఎత్తున చేస్తున్నారు.  టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్ జిబ్రాన్ ఈ సినిమాకు  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.   మొత్తానికి  జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్  సాహోకి  ప్రత్యేకంగా నిలవనుందట.  ఈ చిత్రాన్ని మూడు భాషల్లో భారీ బడ్జెట్ తో టాలీవుడ్ ప్రేస్టేజియ‌స్ ప్రోడ‌క్ష‌న్ హౌస్ యువి క్రియెష‌న్స్ బ్యాన‌ర్ లో వంశి, ప్ర‌మెద్, విక్ర‌మ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరి సాహో రిపోర్ట్ ఎలా ఉంటుందో మరి కొన్ని గంటల్లో తెలియనుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: