టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోగా పరిచయమైన కళ్యాణ్ బాబు, ఆ తరువాత మెల్లగా ఒక్కొక్కటిగా వరుసగా విజయాలు అందుకుంటూ, కోట్లాదిమంది ప్రేక్షకుల మనసుల్లో తన ఆకట్టుకునే నటనతో పవన్ కళ్యాణ్ గా పేరు సంపాదించారు. ఇక అభిమానులు ఆయనకు ఇచ్చిన బిరుదు పవర్ స్టార్. 2008లో మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు విరామం ప్రకటించి ప్రజారాజ్యం అనే రాజకీయ పార్టీ నెలకొల్పిన తరువాత, మెగా ఫ్యామిలీ తరపున అతి పెద్ద స్టార్ గా కొనసాగిన పవన్, ప్రస్తుతం టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకరుగా వెలుగొందుతున్నారు. 

అయితే కొన్నేళ్ల క్రితం జనసేన పార్టీ ని నెలకొల్పిన పవన్ కళ్యాణ్, ఆ పార్టీ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్టానికి ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యక్షంగా బరిలోకి దిగడం జరిగింది. గత ఏడాది త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన తన సిల్వర్ జూబిలీ మూవీ అజ్ఞాతవాసి, పవన్ కు కెరీర్ పరంగా ఆఖరి సినిమా. ఇకపై తన రాజకీయ జీవితాన్ని ప్రజాక్షేత్రంలోనే గడపాలి అని నిశ్చయించి పవన్, అతి త్వరలో మళ్ళి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు అనే వార్తలు కూడా కొద్దిరోజుల నుండి ప్రచారం అవుతున్నాయి. ఇకపోతే మరొక నాలుగు రోజుల్లో అనగా సెప్టెంబర్ 2వ తేదీన పవర్ స్టార్ జన్మదినాన్ని పురస్కరించుకుని అప్పుడే ఆయన ఫ్యాన్స్ హడావుడి మొదలెట్టేసారు. 

వారి సందడిలో మొదటి అడుగుగా నేడు, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా పవన్ కళ్యాణ్ బర్త్ డే కామన్ డిస్ప్లే పిక్చర్ ని రిలీజ్ చేయించడం జరిగింది. అప్పుడే ఆ ఫోటోని షేర్స్, లైక్స్ చేస్తూ మెగా ఫ్యాన్స్, పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో దాన్ని వైరల్ చేసేస్తున్నారు. పుట్టినరోజుకు నాలుగురోజుల ముందునుండే ఇంత సందడి చేస్తుంటే, ఇక పవన్ పుట్టినరోజు నాడు మెగా ఫ్యాన్స్ ఇంకెంత సందడి చేస్తారో అని పలువురు సినీ అభిమానులు ఆశ్చర్యంతో సోషల్ మీడియా వేదికల్లో కామెంట్స్ రూపంలో తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: