దర్శకధీరుడు రాజమౌళి "బాహుబలి" తో ప్రపంచనికి తెలుగు సినిమా సత్తను చాటినా దర్శకుడు.బాహుబలి సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2000కోట్లు వసూల్లు సాధించింది.ప్రస్తుతం దర్శకధీరుడు 'RRR' సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ఇద్దరు బడా హీరోలు జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ లు హీరోలుగా నటిస్తున్నారు.ఈ సినిమాను డీవీవీ దానయ్య అత్యంత ప్రతీస్టాత్మకంగా  నిర్మిస్తున్నారు.


ఇందులో తారక్.. కొమరం భీం పాత్రలో,  రామ్ చరణ్‌ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నారు.ఈ సినిమా 1920 ప్రాంతంలో జరిగే ఒక పిరియడిక్ ఫిల్మి.'RRR' సినిమా ఇద్దరు రీయల్ లైఫ్ క్యారెక్టర్ ల చూట్టు అల్లిన కల్పిత గాథ.అందుకే ఈ సినిమాపై టాలీవుడ్‌తో పాటు అన్ని ఇండస్ట్రీలూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి  ఈ సినిమాను 2020 జూలై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.. 
 

'RRR' సినిమాకు బాలీవుడ్ గట్టిపోటి ఇవ్వనుంది. ఎందుకంటే 'RRR' రీలీజ్ అయ్యె సమాయనికి మూడు బాలీవుడ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో రెండు స్టార్ హీరోల సినిమాలు ఉన్నాయి.ఇందులో మొదటిది సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఇన్షా అల్లా . సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.రీసెంట్ గా ఇన్షా అల్లా సాటిలైట్ రైట్స్  ని 190 కోట్లు పెట్టి జయంతిలాల్ గడా సోంతం చేసుకున్నారు. ఈ సినిమాలో ఆలియా భట్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను 2020 జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
మరోక సినిమా   బాలీవుడ్ కిలాడి అక్షయ్ కుమార్ మరియు కత్రినా కైఫ్ జంటగా వస్తున్న చిత్రం సూర్యవన్షి. ఈ సినిమాను రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమా 2020 జూలై ౩౦ రిలీజ్ కానుంది. వీటితో పాటు చంద్రముఖి -2 రీమేక్ ‘భూల్ భులయ్య' కూడా జూలై 31నే విడుదల చేస్తారని టాక్. నాలుగు సినిమాలు 2 రోజుల గ్యాప్ లో రిలీజ్ అయితే థియెటర్స్ సమస్య కచ్చితంగా వస్తుంది.భారీ బడ్జెట్ సినిమాలు కాబట్టి ఓపెనింగ్స్ చాలా ముఖ్యం.చెప్పిన విధంగా అందరు అదే  టైమ్కు వస్తారో లేదో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: