విక్రమ్ సినిమాతో తెలుగు సినిమా ప్రస్థానాన్ని ప్రారంభించిన నాగార్జున శివ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు.  మజ్ను, మణిరత్నం గీతాంజలి సినిమాలు నాగార్జున కెరీర్ ను ఓ మలుపు తిప్పిన సినిమాలుగా చెప్పొచ్చు.  హలో బ్రదర్ సినిమా ద్వారా మాస్ హీరోగా గుర్తింపు పొందారు.  ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, అల్లరి అల్లుడు వంటి కామెడీ సినిమాలతో ఆకట్టుకున్నారు.  నిన్నేపెళ్లాడుతా, మన్మధుడు సినిమాలతో అమ్మాయిల మనసును దోచుకున్నాడు.  కింగ్ సినిమా నాగార్జున కెరీర్ ను మరో మలుపు తిప్పిన సినిమా.  సాంఘిక సినిమాలే కాకుండా, అన్నమయ్య, శ్రీరామదాసు వంటి భక్తి రస చిత్రాల్లో నటించి తనలో ఓ భక్తుడు కూడా ఉన్నాడని నిరూపించుకున్నాడు నాగార్జున.  ఇటీవలే వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సినిమా ఎలాంటి హిట్టయిందో చెప్పక్కర్లేదు.  నిర్మాతగా అనేక చిత్రాలను నిర్మించాడు.  అమ్మాయిలు రాకుమారుడు, టాలీవుడ్ మన్మథుడు, అభిమానులకు కింగ్ ... నాగార్జున పుట్టినరోజు ఈ రోజు. అతని ఫ్యాన్స్ కు పండగే పండగ. ఫేవరేట్ హీరో నాగ్ బర్త్ డేని అభిమానులు ఆనందంగా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. 


 నాగార్జున.. నాని తో కలిసి దేవదాస్ సినిమాలో నాగ్ డాన్ పాత్రలో సూప‌ర్‌గా ఉంటాడు. త‌న కొడుకులిద్ద‌రూ హీరోల‌యినా ఇంకా ఆయ‌న‌ యంగ్ గా కనిపించడం విశేషం.  వయసు పెరిగే కొద్దీ ఆయన అందం కూడా పెరగడం విశేషం.  ఆగష్టు 29 మన్మధుడు నాగార్జున పుట్టిన రోజు.   నాగ్ పుట్టినరోజు పురస్కరించుకొని దేవదాస్ స్టిల్ ఒకటి యూనిట్ రిలీజ్ చేసింది.  లాంగ్ కోట్, హ్యాట్ పెట్టుకొన్న నాగార్జున చాలా యంగ్ గా కనిపించారు.  స్టైలిష్ గా ఉన్న ఈ స్టైల్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది. వయసుతో పాటు కింగ్ అందం పెరుగుతున్నదని కామెంట్లు వస్తున్నాయి.   
అక్కినేని నాగార్జున ఈ ఆగస్ట్ 29న తన 60వ పుట్టినరోజును జరుపుకోబోతున్నారు. ఈ పుట్టినరోజు వేడుకలను ఆయన కొడుకులు నాగచైతన్య, అఖిల్ స్పెషల్‌గా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. యూరప్ దేశాలైన ఎల్బిజియా, స్పెయిన్‌లో నాగ్ పుట్టినరోజు వేడుకలను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయబోతున్నార‌ని స‌మాచారం.


కార్పొరేట్‌ బిజినెస్‌మేన్‌
ఎం.బి.ఎ. చదివిన ఆయన సినిమారంగంలోని వ్యాపారంపై దృష్టి పెట్టారు. అన్నపూర్ణ స్టూడియోతోపాటు టెక్నికల్‌ రంగాలపైనా శ్రద్ధ పెట్టారు. ఆస్తులు, సంపాదన బాగా వున్నప్పటికీ ఇంకా ఏదో సాధించాలని పట్టుదలతో ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌ వంటివి పెట్టి వందలాది సిబ్బంది జీవనోపాధికి ఆసరాగా నిలిచారు. ఎంతో కాలంగా తన వద్ద పనిచేసే సిబ్బందికి ఆసరాగా ఇళ్లు నిర్మించి ఇచ్చారు. టాప్‌ బిజినెస్‌మేన్‌గా పేరు సంపాదించుకున్న ఆయన అన్నపూర్ణ స్టూడియో నిర్వహణ, ఫిలిం స్కూల్‌తోపాటు పలు సామాజిక చైతన్య కార్యక్రమాల్లో ముందుంటారు. టీవీ హోస్ట్‌గా 'మీలో ఎవరు కోటీశ్వరుడు' నిర్వహించిన ఆయన ప్రస్తుతం 'బిగ్‌బాస్‌3'కు హోస్ట్‌గా వున్నారు. అదీ తన స్టూడియోలో నిర్వహించడం విశేషం. ఆమధ్య మా టీవీలోనూ భాగస్వామి కూడా అయ్యారు. 
అలాగే తెలుగు చలన చిత్ర పరిశ్రమకు నాగార్జున అందించిన న్యూ టాలెంట్‌ను మరే హీరో అందించలేదనే చెప్పాలి. కొత్త దర్శకులతో పనిచేయడానికి ఆలోచించే రోజుల్లోనే ఆయన తనే నిర్మాతగా మారి వారిని ఎంకరేజ్‌సిన సందర్భాలూ చాలానే వున్నాయి. మొన్నటి రామ్‌గోపాల్‌వర్మ నుంచి నిన్నటి కళ్యాణ కృష్ణ కురసాల వరకు దాదాపు 12 మంది దర్శకులకు అవకాశం కల్పించారు. అయితే రిస్క్‌ తీసుకున్న కొన్ని సందర్భాల్లో చేదు అనుభవాలు కూడా ఎదురయ్యాయి.  ఇక నటుడిగా పలు అవార్డులు అందుకున్న ఆయన ఇంట్లో అవార్డుల గ్యాలరీనే వుంది. నిర్మాతగా 9 ప్రతిష్టాత్మక నంది అవార్డులు అందుకున్న ఆయన నిన్నే పెళ్లాడుతా, రాజన్న చిత్రాల ద్వారా జాతీయ పురస్కారాలు లభించాయి. నటుడిగా తనలాగే తన వారసుల్ని ముందుకు తేయడమేకాకుండా ఓ నటిని కోడలిగా ఆహ్వానించడం విశేషమనే చెప్పాలి. ఈనెల 29న ఆయన పుట్టినరోజు. ప్రతిసారీ ఆయన ఫ్యాన్స్‌ ఏదోరకంగా వేడుకలు నిర్వహించేవారు. మూడేళ్ళనాడు అనుకోనివిధంగా ఫ్యాన్స్‌ అధ్యక్షుడు చనిపోవడంతో అప్పటినుంచి వేడుకలు చేసుకోనని స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. ఆరోజు పలు సేవా కార్యక్రమాలు చేయమని అభిమానులకు సూచించారు. ఆయన ఆచరిస్తున్నారు. తాజాగా ఆయన సోగ్గాడే.. చిత్రానికి సీక్వెల్‌ చేసే పనిలో వున్నారు. ఆయ‌నకి ఇండియా హెరాల్డ్ టీమ్ త‌ర‌పున పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు. 



మరింత సమాచారం తెలుసుకోండి: