సాహో ఫీవ‌ర్ ఇపుడు ఆల్ ఓవర్ ఇండియాకు పట్టుకుంది. సాహో మూవీ చూడడం గ్రేట్ గా ఆడియన్స్ ఫీల్ అయ్యేలా వస్తోందంటే నిజంగా క్రియేటర్స్ కి జోహార్ అనాలి. మరి కొద్ది గంటల్లో వేలాది స్క్రీన్స్ మీద సాహో అద్భుతం స్రుష్టిస్తుందని అంటున్నారు. పాతికేళ్ళ కుర్రాడు డైరెక్టర్  గా తన సినిమా దాహాన్ని తీర్చుకున్నాడు. ఎల్లలు లేని కలలకు సెల్యూలాయిడ్ రూపం ఇచ్చి రన్ సాహో రన్ అంటున్నాడు.


సాహో ప్రభాస్ 21వ సినిమా. సాహో కి ముందు ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టార్ గా బాహుబలి బిగినింగ్, బాహుబలి కంక్లూషన్ తో గొప్ప కీర్తిని ఆర్జించాడు. ఇక ఆ తరువాత ప్రభాస్ మూవీ ఏంటి అన్నపుడు సాహో ముందుకు వచ్చింది. రాజమౌళి ఎన్నో సినిమాల తరువాత బాహుబలిని చెక్కితే కేవలం ఒకే ఒక్క సినిమా రన్ రాజ రన్ తీసిన యువకుడు సుజిత్ సాహో తీసి చరిత్ర స్రుష్టించబోతున్నాడు.


ఈ మూవీ హాలీవుడ్ రేంజికి ఏ మాత్రం తగ్గకుండా డిజైన్ చేశారంటేనే సుజిత్ టాలెంట్ ఏంటో అర్ధమైపోతుంది. పట్టుమని పాతికేళ్ళు లేని సుజిత్ దిగ్గజాలైన టెక్నీషిన్లను  రెండేళ్ళ పాటు శాసించి  తన ఆలోచనలకు వెండి తెర రూపం ఇచ్చాండంటేనే సాహో అనాల్సి వస్తుంది. సుజిత్ ఒక్కడే కుర్రోడు, మిగిలిన హోల్ టీం కంప్లీట్ ఎక్స్ పీరిఎన్సుడ్. కానీ ఏ మాత్రం తొణక్కుండా బెణక్కుండా సుజిత్ మూవీని తీసిన తీరుకే సాహో అంటున్నారు.


ఇక ప్రభాస్ రెండేళ్ళ కష్టం ఈ సినిమా. అప్పటికి బాహుబలి కోసం నాలుగేళ్ళ టైం ఖర్చు చేసిన ప్రభాస్ సాహో కోసం మరో రెండేళ్ళు అంటే నిజంగా ఆయనకు ఉన్న ప్యాషన్ కి సాహో అనాల్సిందే. ప్రభాస్ లోకల్  హీరో కాడు, ఇపుడు హాలీవుడ్ స్టార్ అని గుర్తించిన సినిమాగా సాహో రావడంతో ప్రభాస్ కి ఫ్యాన్స్ మళ్ళీ సాహో అంటున్నారు.


 టాలీవుడ్ తలెత్తుకునే సినిమాను తెస్తున్న ప్రభాస్ కాలాన్ని, కరెన్సీని ఖాతరు చేయకుండా ఇదీ మన సినిమా అని చెబుతున్నందుకు యావత్తు సినీ లోకం సాహో అంటోంది. మొత్తానికి మరి కొద్ది గంటల్లో వస్తున్న సాహో టాలీవుడ్ ని ఎక్కడికో తీసుకుపోవడం ష్యూర్ అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: