పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వస్తుంది అంటే అభిమానులకు సందడే అని చెప్పాలి.  గతేడాది అంటే 2018 వరకు పవన్ కళ్యాణ్ తన పుట్టినరోజు వేడుకలను సినిమా రంగం పరంగా జరుపుకునే వారు.  మొదటిసారి ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు.  పూర్తిస్థాయిలో రాజకీయాల్లో ఉన్నారు.  ఒక రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోబోతున్నారు. 


ఈ వేడుకలను అభిమానుల సమక్షంలో భారీ ఎత్తున జరుపుకోవడానికి పవన్ సిద్ధం అయ్యాడు.  సెప్టెంబర్ 2 వ తేదీన పవన్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఇప్పటికే  వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టేందుకు రెడీ అయ్యారు.  అయితే, రాజకీయాల్లోకి వచ్చిన తరువాత జరుపుకుంటున్న మొదటి పుట్టినరోజు కావడంతో ఈసారి  కాస్త  వినూత్నంగా జరుపుకోవాలని చూస్తున్నారు.  ఇందులో భాగంగానే కార్యకర్తల రిక్రూట్ మెంట్ విధానాన్ని పవన్ పుట్టినరోజు నుంచి ప్రారంభించే అవకాశం ఉన్నది.  


దీంతో పాటు వివిధ రకాల సామజిక కార్యక్రమాలు చేపట్టబోతున్నట్టు సమాచారం.  అయితే, ఎప్పటిలాగే పవన్ కళ్యాణ్ ఈ వేడుకలు దగ్గరగా  ఉంటారో లేదంటే సినిమా ఇండస్ట్రీలో  ఉన్నప్పుడు ఎలాగైతే  దూరంగా ఉన్నాడో అలా దూరంగా ఉంటాడో చూడాలి.  రాజకీయాల్లోకి వచ్చిన తరువాత జరుపుకుంటున్న మొదటి పండుగ కాబట్టి తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని అంటున్నారు.  


ఆరోజున ఎలాగో వినాయక చవితి కూడా ఉన్నది.  కాబట్టి చవితి పండుగతో పాటు పుట్టినరోజు వేడుకలు రెండు ఒకేసారిజరుపుకుంటున్నారు.  ఇదిలా ఉంటె, ఈనెల 30 వ తేదీన పవన్ కళ్యాణ్ అమరావతిలో  రాజధాని రైతులను కలవబోతున్నారు.  భూములు ఇచ్చిన రైతులు,  కౌలు రైతులతో పవన్ ఆగష్టు 31 వ తేదీన మంగళగిరిలోని తన పార్టీ ఆఫీస్ లో సమావేశం కాబోతున్నారు.  రైతులతో పవన్ ఏ ఏ విషయాల గురించి మాట్లాడబోతున్నారు.   సమావేశంలో వీటి గురించి పవన్ మాట్లాడతారు అన్నది ఆసక్తికరంగా మారింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: