భారతీయ చలన చిత్ర రంగంలో సూపర్ స్టార్ రజనీకాంత్ క్రేజే వేరు. హిట్టు ఫ్లాపు లతో సంబంధం లేకుండా రజినీకాంత్ ని అభిమానిస్తారు రజనీ అభిమానులు. ముఖ్యంగా రజినీకాంత్ స్టైల్ ఆయన వాకింగ్ స్టైల్ అంటే తెగ పడిచస్తారు రజినీ ఫ్యాన్స్. రజనీ సినిమా హిట్ అయ్యిందంటే బాక్సాఫీస్ దగ్గర రచ్చ మామూలుగా ఉండదు సినిమా రికార్డు మొత్తం తిరగరాస్తుంది. ముఖ్యంగా రజినీకాంత్ అభిమానులు కేవలం దేశంలోనే కాదు విదేశాల్లో కూడా ఆయన్ని చాలా బాగా అభిమానించే వాళ్ళు ఉన్నారు.


ముఖ్యంగా అంత క్రేజ్ ఉన్నాగాని రజనీకాంత్ చాలా నిరాడంబరంగా జీవించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కేవలం ఆయన సామాన్య జీవితాన్ని చూసి చాలా మంది సామాన్యులు ఆయన చాలా విపరీతంగా గుండెల్లో దాచుకుని మరీ అభిమానిస్తారు. నాలుగు దశాబ్ధాల నట జీవితంలో ఎన్నో అవార్డులు.. రివార్డులు ఉన్నాయి..తాజాగా ఆయన నిరాడంబరత గురించిన వార్త ఆయన ఫ్యాన్స్ లో హాట్ టాపిక్ గా మారింది. రజనీకాంత్ తో యజమాని చిత్రం డైరక్ట్ చేసిన ఉదయ్ కుమార్ మాట్లాడుతూ ఈ విషయాలు షేర్ చేసారు. ఆర్‌వీ ఉదయకుమార్‌ మాట్లాడుతూ.. ‘‘ పలువురు నటులు పార్టీలు ప్రారంభిస్తున్నారు. వాళ్లు పార్టీ పెట్టి దేశాన్ని కాపాడే ముందు, వాళ్లను పెంచి పెద్దజేసిన చిత్ర పరిశ్రమను రక్షించాల్సిన ఆవశ్యకత ఉంది.


భారీ పారితోషికాలు తీసుకునే నలుగురు పెద్ద హీరోలు చర్చిస్తేనే ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఈ క్యారవాన్‌ సంస్కృతి ఎప్పుడు మొదలైందో అప్పటినుంచే నిర్మాతకు సమస్యలు మొదలయ్యాయి. రజనీకాంత్‌తో నేను ‘ఎజమాన్‌’ సినిమాను తెరకెక్కించా. అప్పుడు ఆయన షూటింగ్‌ స్పాట్‌లో కొబ్బరిమట్టపైనే నిద్రించేవారు. అంత నిరాడంబరమైన వ్యక్తి రజనీ అని’’ అందుకే రజనీకాంత్ ని సూపర్ స్టార్ అంటారు అని పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: