సెన్సేషనల్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ , హుషారు ఫేమ్ తేజస్ కంచెర్ల  జంటగా నటిస్తున్న చిత్రం 'ఆర్ డి ఎక్స్ లవ్'.  ఇటీవల ఈ సినిమాలోని  పాయల్
స్టిల్స్ ను  విడుదల చేసి సినిమా ఎలా వుండనుందో హింట్ ఇచ్చారు మేకర్స్.  ఇక  కొద్దీ సేపటి క్రితం ఈసినిమా టీజర్ ను విడుదల చేశారు.  అడల్ట్ సన్నివేశాలతో బి గ్రేడ్ సినిమా కు ఏ మాత్రం తగ్గకుండా వుంది ఈ టీజర్.  దాంతో టీజర్ ఫై  ఓ  రేంజ్ లో  ఫైర్ అవుతున్నారు సినీ ప్రేమికులు.   అసలు ఈలాంటి సినిమా ఎలా తీయాలనిపిస్తుంది మీకు ? తెలుగు సినిమా పరువు తీస్తున్నారని మేకర్స్ ఫై  విమర్శలు గుప్పిస్తున్నారు. 



ఇక టీజర్ చూస్తుంటే  కేవలం  పాయల్ గ్లామర్ ను అడ్డం పెట్టుకొని  యూత్ టార్గెట్ చేస్తూ సినిమా తీసినట్టుగా అనిపిస్తుంది.  ఆర్ ఎక్స్ 100 లోకూడా  పాయల్ ఇదే తరహా పాత్రలో నటించింది. అయితే ఆచిత్రంలో   కేవలం గ్లామర్ తోనే కాకుండా నటన తోను మెప్పించింది.  మరి అలాంటి నటిని  కేవలం బోల్డ్ పాత్రలకే  పరిమితం చేసేలా వుంది ఈ సినిమా.  అయితే ఇటీవల పాయల్ మాట్లాడుతూ  ఆర్ డి ఎక్స్ లవ్ లో మంచి స్టోరీ కూడా వుంది అదేంటంటే  ఓ అమ్మాయి ఊరిని దత్తత తీసుకోని  అక్కడ వున్న వారి సమస్యలను ఎలా పరిష్కరించిందో  అనేదే ఈసినిమా  థీమ్ .. అందుకే ఈసినిమా ఒప్పుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది. 





అయితే  టీజర్  చూస్తే మాత్రం  ఏదో ఓ స్టోరీ ఉండాలి కాబట్టి  అలా  దర్శకుడు ఓ  స్టోరీ ని అల్లుకున్నాడు తప్ప  సీరియస్ గా ఆ సినిమాతో ఏం చెప్పాలనుకున్నాడో  తనకే క్లారిటీ లేనట్లుగా  అనిపిస్తుంది.  ఒకవేళ సినిమా లో మంచి కంటెంట్ ఉంటే మేకర్స్ టార్గెట్ రీచ్ అవుతుంది లేకపోతే ఎంత స్కిన్ షో వున్న ఎవరు పట్టించుకోరు.  నూతన దర్శకుడు శంకర్ భాను డైరెక్ట్ చేస్తున్న  ఈ చిత్రాన్నిసి కే ఎంటర్ టైన్మెంట్స్ పతాకం ఫై  సి కళ్యాణ్ నిర్మిస్తున్నాడు. అర్జున్ రెడ్డి ఫేమ్ రధాన్ సంగీతం అందిస్తున్నాడు. సెప్టెంబర్ లో ఈచిత్రం విడుదలకానుంది.    


మరింత సమాచారం తెలుసుకోండి: