ఒక పక్క బిగ్ బాస్ సీజన్-3 రేటింగ్ లు రోజు రోజుకూ పడిపోతుంటే బిగ్ బాస్ నిర్వాహకులకు మరో షాక్ తగిలేలా ఉంది. ఈరోజు మన స్టార్ హీరో అక్కినేని నాగార్జున తన 60వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. అయితే దీనికి సంబంధించిన పార్టీ స్పెయిన్ లోని ఇబిజాలో జరుగుతోంది. ఇప్పటికే నాగచైతన్య, అఖిల్, సమంత మరియు ఇతర స్నేహితులు అంతా అక్కడికి వెళ్లి పుట్టినరోజు సంబరాల్లో మునిగితేలుతున్నారు. ఇక్కడే మొదలైంది బిగ్బాస్ ప్రేక్షకులు మరియు నిర్వాహకులకు అసలైన టెన్షన్.

సాధారణంగా ప్రతివారం చివరలో శనివారం మరియు ఆదివారం బిగ్ బాస్ ఎలిమినేషన్ ప్రక్రియ జరుగుతుంది. అందుకు సంబంధించిన షూటింగ్ శుక్రవారం మరియు శనివారం వరుసగా చేస్తారు. ఆ రెండు రోజుల్లో నాగార్జున హోస్ట్ గా వ్యవహరించాల్సి ఉంటుంది. అందుకు ఆయన షూటింగ్ లో పాల్గొనడం తప్పనిసరి.  అయితే ఈ రోజు గురువారం అంటే రేపే షూటింగ్. నాగార్జున ప్రస్తుతం స్పెయిన్లో ఉన్నారు. ఐబిజా నుండి హైదరాబాద్ కు తిరిగి రావడానికి మూడు ఫ్లైట్ లు మారాల్సి ఉండగా మొత్తం 20 గంటల ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కావున నాగార్జున రేపు షూటింగ్ టైం కి అందుకోగలడా లేదా అన్నది ఇప్పటికీ సందేహమే.

నామినేషన్ లో ఉన్న ఆరుగురిలో ఉన్నఫలంగా బిగ్ బాస్ అత్యంత నాటకీయ తరహాలో ముగ్గురికి ఇమ్యూనిటీ అందేలాగా టాస్క్ లు ఇచ్చారు. ఎప్పుడూ లేనిది బిగ్ బాస్ ఏకంగా ముగ్గురిని సేవ్ చేయడం ఏంటి అని ఇప్పటికే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ సమయంలో నాగార్జున స్పెయిన్ లో ఉండడం అతను అనుకున్న టైమ్ కి షూటింగ్ కి అందుకోలేక పోయే అవకాశాలు ఎక్కువ ఉండడంతో ఈ వారం అసలు ఎలిమినేషన్ ఎపిసోడ్ లేకుండా ఉండే అవకాశాలు కూడా చాలానే ఉన్నాయి. అందుకే బిగ్ బాస్ టాస్క్ ఇచ్చినట్లు ఉన్నాడు అని కొందరు అభిప్రాయపడుతున్నారు. లేదా నాగ్ రాత్రికి హుటాహుటిన బయలుదేరి సరిగ్గా షూటింగ్ సమయానికి అక్కడికి చేరుకున్నట్లైతే అతని కమిట్మెంట్ కి మనమంతా మెచ్చుకోక తప్పదు. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అని తెలుసుకోవడం కన్నా అసలు ఎలిమినేషన్ ఉంటుందా లేదా అన్న విషయం ఇప్పుడు పెద్ద సస్పెన్స్ గా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: