నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న 105వ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. హ్యాపీ మూవీస్‌ బ్యానర్‌పై కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో సి.కల్యాణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన బాలకృష్ణ న్యూ లుక్‌ డిఫరెంట్‌గా ఉందని అందరూ అప్రిషియేట్‌ చేశారు. అలాగే ఇటీవల థాయ్‌లాండ్‌లో ఈ సినిమా తొలి షెడ్యూల్‌ చిత్రీకరణ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తయ్యింది. చిత్ర నటీనటులందరూ పాల్గొనగా.. 20 రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్‌లో రెండు పాటలు, కొంత టాకీపార్ట్‌, భారీ యాక్షన్‌ ఏపిసోడ్‌ను షూట్‌ చేశారు. సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ప్రకాశ్‌రాజ్‌, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.  చిరంత‌న్ భ‌ట్‌ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి సి.రామ్‌ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 


థాయ్‌లాండ్‌ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. సినిమాలోని ప్రధాన తారాగణం మొత్తం ఈ షెడ్యూల్‌లో భాగం అయ్యారు. గౌతమ బుద్ద గా నటసింహం నా నిజమైన హీరో అతనే.. పవన్ కల్యాణ్‌ షాకింగ్ ట్వీట్ ఎన్నికల్లో సినీ స్టార్లు... ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు? జైసింహా వంటి సూపర్‌హిట్ చిత్రం తర్వాత బాలక‌ృష్ణ, సి.కల్యాణ్, కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం కావడంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. చిరంతన్ భట్ సంగీతం అందిస్తోన్నారు. 


నందమూరి బాలకృష్ణ, సోనాల్ చౌహాన్, వేదిక, ప్రకాశ్ రాజ్, భూమిక చావ్లా, జయసుధ, షాయాజీ షిండే, నాగినీడు, సప్తగిరి, శ్రీనివాస్‌రెడ్డి, రఘుబాబు, ధన్‌రాజ్ తదితరులు న‌టిస్తున్న ఈ చిత్రానికి దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్, నిర్మాత: సి.కల్యాణ్, కో ప్రొడ్యూసర్స్:  సి.వి.రావ్, పత్సా నాగరాజు, కథ: పరుచూరి మురళి, మ్యూజిక్: చిరంతన్ భట్,  సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్, ఆర్ట్: చిన్నా, పాటలు: రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల,  ఫైట్స్: రామ్ లక్ష్మణ్, కొరియోగ్రఫీ: జానీ మాస్టర్.


మరింత సమాచారం తెలుసుకోండి: