పదివేల ధియేటర్లలో విడుదలైన ‘సాహో’ మూవీకి సంబంధించి ఓవర్సీస్ ప్రేక్షకుల తొలి టాక్ బయటకు వస్తోంది. ఈ మూవీ ఫస్ట్ ఆఫ్ చాల బాగుంది. ప్రభాస్ యాక్టింగ్ సూపర్ అంటూ ఈ మూవీలోని ప్రతి యాక్షన్ సన్నివేశంతో పాటు ఇంటర్వెల్ ట్విస్ట్ సూపర్ అంటూ కామెంట్స్ వస్తున్నాయి. 

ప్రభాస్ మాస్ లుక్ చూడాలి అంటే ఒక్క ‘సాహో’ సరిపోతుంది అంటూ ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ ఖాయం అంటూ కొందరు ఈ సినిమాను చూస్తూనే సోషల్ మీడియాలో తమ ట్విట్స్ ద్వారా హడావిడి చేస్తున్నారు. శ్రద్ధా కపూర్ ప్రభాస్ ల లవ్ కెమిస్ట్రీ అదుర్స్ అంటూ మరికొందరు ఓవర్సీస్ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ప్రశంసలతో సమానంగా ఈ మూవీని చూసిన కొందరు ఓవర్సీస్ ప్రేక్షకులు తమ నెగిటివ్ కామెంట్స్ కూడ చేస్తున్నారు. 

స్క్రీన్ ప్లే చాల వీక్ గా ఉందని సాంగ్స్ లో ఏమాత్రం స్టఫ్ లేదనీ కేవలం ఒక్క ఫోటోగ్రఫీ తప్ప ఈ సినిమా గురించి చెప్పుకోతగ్గ విషయాలు లేవు అంటూ అప్పుడే నెగిటివ్ ప్రచారం మొదలుపెట్టేసారు. అయితే ఈ సినిమాను చూసిన ప్రభాస్ వీరాభిమానులు మాత్రం యాక్షన్ సీన్స్ లో ప్రభాస్ నటన సూపర్ అంటూ ఈమూవీకి జీవం పోసింది ఈమూవీకి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరియు ఫోటోగ్రఫీ అంటూ సుజిత్ ను ప్రశంసిస్తున్నారు. 

కానీ కొందరు ఓవర్సీస్ ప్రేక్షకులు మాత్రం ఈ మూవీ చాల బోరింగ్ గా ఉందనీ వెంటనే నిద్ర వచ్చేస్తుందనీ ఈ సినిమాకు సంబంధించిన విజువేల్స్ ఇంటర్వెల్ ట్విస్ట్ తప్ప ఈ సినిమాలో ఇక ఏమీలేదు అంటూ ఈ మూవీకి 2/5 రేటింగ్ లు ఇవ్వడం కలవర పెట్టే విషయం. ప్రభాస్ అభిమానులు కానివారు కూడ ఈ సినిమాను కాపాడగలిగింది ఒక్క సెకండ్ ఆఫ్ మాత్రమే అనీ ఫస్ట్ ఆఫ్ అంతా పాత్రల ఇంట్రడక్షన్స్ తో అనవసరంగా వృథా అయింది అని కామెంట్స్ చేస్తూ ఈమూవీలో వచ్చే ఒక సీన్ లో ప్రభాస్ షర్ట్ లేకుండా కనిపించే మాస్ అవతారం చూసి ప్రభాస్ అభిమానులు జోష్ లోకి వెళ్ళిపోతారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు వస్తున్న ప్రాధమిక టాక్ లీకులు చూస్తుంటే ఈమూవీకి డివైడ్ టాక్ తప్పదా అన్న సందేహం వస్తోంది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: