2019 సంవత్సరంలో టాలీవుడ్లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా సాహో. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 350 కోట్ల రుపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 320 కోట్ల రుపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. శాటిలైట్, డిజిటల్ రైట్స్ 160 కోట్ల రుపాయలకు అమ్ముడయినట్లు సమాచారం. ఈరోజు విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. 
 
సాహో సినిమాకు ప్లస్ పాయింట్లు ఏమిటంటే సినిమాలో మొదటినుండి చివరివరకు అద్భుతమైన యాక్షన్ సీక్వెన్సులు ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉన్నాయి. హీరో హీరోయిన్లైన ప్రభాస్, శ్రధ్ధాకపూర్ మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్, ఇంటర్వెల్ కు ముందు 15 నిమిషాలు, ఇంటర్వెల్ ట్విస్ట్, సినిమాలోని చివరి 30 నిమిషాలు అద్భుతంగా ఉన్నాయి. సినిమా విజువల్స్ పరంగా చాలా రిచ్ గా తెరకెక్కించటం విశేషం. 
 
సాహో సినిమా మైనస్ పాయింట్ల విషయానికి  సినిమాలోని కొన్ని సీన్లు ల్యాగ్ అయ్యాయన్న ఫీలింగ్ సినిమా చూసిన ప్రేక్షకులకు వస్తుంది. సినిమా నిడివి కొంచెం తగ్గించి ఉంటే బాగుండేది. సినిమాలోని కొన్ని సీన్లు బోరింగ్ గా ఉన్నాయి. సినిమాలో సెకండాఫ్ బాగానే ఉన్నప్పటికీ పస్టాఫ్ విషయంలో దర్శకుడు ఇంకొంచెం శ్రధ్ధ వహించి ఉంటే బాగుండేది. సినిమాలోని కొన్ని ట్విస్టులు ప్రేక్షకులు ముందుగానే ఊహించేలా ఉండటం కూడా సినిమాకు కొంత మైనస్ గా మారిందని చెప్పవచ్చు. 
 
సినిమా మొదటి నుండి చివరిదాకా హీరో ప్రభాస్ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. పాటలు విజువల్స్ పరంగా ఆకట్టుకునేలా ఉండటం విశేషం. మొదటిరోజు ఈ సినిమాకు 70 కోట్ల నుండి 100 కోట్ల రుపాయల మధ్యలో షేర్ రావచ్చని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వీకెండ్ తరువాత ఈ సినిమా సాధించే కలెక్షన్లను బట్టి ఈ సినిమా ఫైనల్ స్టేటస్ చెప్పవచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: