బాహుబలి తరువాత   ప్రభాస్ నటించిన సినిమా , భారీ బడ్జెట్ , భారీ స్టార్ క్యాస్టింగ్ ,హాలీవుడ్ లెవల్ వి ఎఫ్ ఎక్స్  .. ఇన్ని ప్రత్యేకతలతో తెరకెక్కింది సాహో.  విడుదలకు ముందు ప్రభాస్ అన్ని తానై సినిమాకు  విపరీతంగా ప్రచారం చేశాడు దాంతో సాహో ఫై  అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. అయితే  ఎన్ని వున్నా సినిమాకు  దర్శకుడే బలం.  ఆ దర్శకుడే  చేతులెత్తేస్తే  ఫలితం ఏమైతుందో తెలిసిందే.  ఇప్పుడు  సాహో విషయంలోనూ అలాగే జరిగింది.  కేవలం ఒకే  ఒక్క సినిమా అనుభవం కలిగిన డైరెక్టర్ సుజీత్ కు ఇంత పెద్ద ప్రాజెక్ట్  అప్పజెప్పారు. దాన్ని హ్యాండిల్ చేయడంలో సుజీత్  పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. సినిమాలో స్టోరీ లేకపోవడం , దర్శకుడి కన్ఫ్యూజన్ , అనవసరమైన క్యాస్టింగ్ , యాక్షన్ సన్నివేశాలు వెరిసి సాహు కు వస్తున్న టాక్  డిజాస్టర్.. 




 ఇక  దాదాపు రెండు సంవత్సరాల తరువాత తమ అభిమాన హీరో నటించిన  సినిమా  కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూశారు  ప్రభాస్ అభిమానులు.  అయితే  వారి ఆనందం ఆవిరి కావడానికి ఎంతో సమయం పట్టలేదు.  ఈ చిత్రం  ఈ రోజు విడుదలకాగా .. ప్రీమియర్స్ , మార్నింగ్ షోస్ నుండి వస్తున్న టాక్ ప్రకారం సినిమా డిజాస్టర్ అని తేలిపోయింది.  అయితే మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ బాగా జరగడంతో  సాహో భారీ ఓపెనింగ్ ను రాబట్టుకోనుంది. 




ఇక బాహుబలి తో  ప్రభాస్  ఇమేజ్ దేశవ్యాప్తంగా విస్తరించగా ఇప్పుడు సాహో తో సుజీత్ ఆ ఇమేజ్ ను డ్యామేజ్  చేశాడు.  అయితే  ఈ స్టోరీ తో ప్రభాస్ ను అలాగే నిర్మాతలను  ఒప్పించినందుకు ఓ రకంగా సుజీత్ కు హ్యాట్సాఫ్  చెప్పాల్సిందే. 




మరింత సమాచారం తెలుసుకోండి: