తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ 3 ఆరోవారం సందడి సందడిగా సాగుతుంది. ఎప్పుడూ గిల్లికజ్జాలు పెట్టుకునే ఇంటి సభ్యులు ఈసారి తమ పర్ఫామెన్స్ తో దుమ్ముదుళుపుతున్నారు. ఈవారం మొదట ఇంటి సభ్యులకు చిత్రమైన టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ నేపథ్యంలో వరుణ్ సందేష్, రవికృష్ణ,రాహూల్ కి కఠినమైన టాస్క్ ఇచ్చారు.  ఈ టాస్క్ లో రవికృష్ణ తన వద్ద ఉన్న క్రీమ్ వితిక జుట్టుకు రాయడం, ఒకరి మంచంపై నీళ్లుజల్లడం, రాహూల్ తనపై ఇంటి సభ్యులకు కోపం వచ్చేలా చేయడం..ఇక వరుణ్ సందేష్ కి చల్లని కాఫీ ఎవరిపై అయినా కొట్టాలి.

అయితే వరుణ్ సందేష్ కాఫీ తన భార్యపైనే చల్లారు. ఆ తర్వాత కత్తెరతో తన భార్య డ్రెస్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశారు. దాంతో ఇద్దరి మద్య కాస్త గొడవ నెలకొన్నా తర్వాత ఇరువురు ప్రేమతో కలుసుకున్నారు.  ఇక బాబా భాస్కర్ డైరెక్షన్ తనదైన స్టైల్లో చూపించి అందరి మన్ననలు పొందాడు. నిన్నటి ట్రైన్ ఎపిసోడ్ లో ఎర్రగడ్డ లవ్‌ స్టోరీ అంటూ ఓ మూవీకి డైరెక్షన్ చేశారు. ఈ టాస్క్‌లో బాబా భాస్కర్‌ తన దర్శకత్వ ప్రతిభను ప్రదర్శించగా.. అలీ  బాంబే విలన్ గా, రవికృష్ణ  హీరోగా తమ పర్ఫామెన్స్‌తో ఇరగదీశారు.

ఆ సినిమా కథ, కథనాలు చూస్తుంటే కళ్లముందు నిజంగా ఓ సినిమా చూసినట్లే అనిపించింది.  కెమెరామెన్‌గా వరుణ్, అసిస్టెంట్‌గా రాహుల్ తమ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారు. శ్రీముఖి, హిమజ, మహేష్ తమ పెర్ఫార్మన్స్ సూపర్ అనిపించుకున్నారు.  వీరందరిని బాబా భాస్కర్ చాలా కామెడీగా డైరెక్ట్ చేయడం నిన్నటి ఎపిసోడ్ కి హైలెట్ అనే చెప్పాలి. ‘ఛలో ఇండియా టాస్క్’లో బాబా భాస్కర్, రాహుల్, వరుణ్‌లను బెస్ట్ పెర్ఫామెన్స్‌గా ఎన్నుకున్నారు కంటెస్టెంట్స్. దీంతో ఈ ముగ్గురు సభ్యులు ఈవారం హౌస్‌కి కెప్టెన్ అయ్యే పోటీదారులుగా ప్రకటించారు బిగ్ బాస్. 


మరింత సమాచారం తెలుసుకోండి: