ఓ సినిమా హిట్ అవ్వాలంటే ఎంత బ‌డ్జెట్ పెట్టాం... ఎంత స్టార్ కాస్టింగ్ ఉంది... ఎంత బిజినెస్ చేసింది... ఎంత గ్రాండ్‌గా విజువ‌ల్స్ ఉన్నాయి... ఎన్ని రోజులు షూట్ చేశాం... ఎంత క‌ష్ట‌పెట్టాం అన్న‌ది అస్స‌లు ముఖ్యం కాదు.. ఆ సినిమా అంతిమంగా ప్రేక్ష‌కుల మ‌న‌స్సులు గెలుచుకుందా ?  లేదా ? అన్న‌దే కావాలి. బాహుబ‌లి 1,2 పార్టులు తీసేందుకు నాలుగు సంవ‌త్స‌రాలు ప‌ట్టింది... సినిమాను చ‌రిత్ర‌లోనే క‌నీవినీ ఎరుగ‌ని రేంజ్‌లో బ్లాక్‌బస్ట‌ర్ చేసి ప‌డేశాడు ఇండియ‌న్ సినిమా ప్రేక్ష‌కులు. 


అస‌లు ఇండియ‌న్ సినిమా చ‌రిత్ర‌లో ఇంత‌కు ముందెన్న‌డు రాని రేంజ్‌లో బాహుబ‌లి రికార్డుల‌కు ఎక్కింది. ఓ ప్రాంతీయ భాషా సినిమా నేష‌న‌ల లెవ‌ల్ దాటేసి వ‌ర‌ల్డ్ రేంజ్ సినిమాగా నిలుస్తుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. అంత మాత్రాన ఆ సినిమాను చూసి వాత‌లు పెట్టుకుంటా.. అదే రేంజ్‌లో బ‌డ్జెట్ పెట్టి దానిని త‌ల‌ద‌న్నే సినిమా చేస్తాం అని అంద‌రూ అనుకుంటే స‌రిపోతుందా ?  అందుకు త‌గ్గ క‌థ‌, క‌థ‌నాలు, డైరెక్ట‌ర్ అన్ని సెట్ అవ్వాలి.


బాహుబ‌లినే ఫాలో అయిన సాహో మేక‌ర్స్ భారీ బ‌డ్జెట్, గ్రాండ్ విజువ‌ల్స్‌, బాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌, ఒక్కో పాట‌కు ఒక్కో మ్యూజిక్ డైరెక్ట‌ర్ చొప్పున మొత్తం ఐదుగురు మ్యూజిక్ డైరెక్ట‌ర్లు, ఆర్ ఆర్‌కు మ‌రో మ్యూజిక్ డైరెక్ట‌ర్, ఇక రెండేళ్ల శ్ర‌మ, కోట్లు ఖ‌ర్చు చేసిన నిర్మాత‌లు ఇవ‌న్నీ తొలి రోజు తొలి ఆట‌కే బూడిద‌లో పోసిన ప‌న్నీరు అయ్యాయి. వీళ్లంద‌రి రెండేళ్ల క‌ష్టం గోవిందా.. గోవిందా అయ్యింది. 


బాహుబ‌లి కోసం నాలుగేళ్లు క‌ష్ట‌ప‌డితే ప్ర‌భాస్‌కు నేష‌న‌ల్‌గానే కాకుండా వ‌ర‌ల్డ్ వైడ్‌గా క్రేజ్ వ‌చ్చింది. ఆ సినిమా స్టార్‌డ‌మ్ కంటిన్యూ చేయాల్సిన సుజిత్ ప్ర‌భాస్‌ను మ‌ళ్లీ అధః పాతాళంలోకి ప‌డేశాడు. ప్ర‌భాస్ ఇప్పుడు మ‌ళ్లీ తెలుగులో రీజ‌నల్ మార్కెట్ రేంజ్ సినిమాలు చేసుకోవ‌డం మిన‌హా చేసేందే ఉండ‌దు. 
ద‌ర్శ‌కుడు సుజిత్ ఈసారి నేల విడిచి సాము చేశాడు.

కథ ఎలా ఉన్నా..పరిమితమైన వనరులతోనే కథనంతో మాయాజాలం చేయగల పనితనం ఉందని రన్  రాజా రన్‌తో రుజువు చేసిన అతను.. ఈసారి అవసరానికి మించి వనరులున్నా వాటిని ఉపయోగించుకోవడంలో ఘోరంగా విఫలమయ్యాడు. ఐదారు నెల‌ల్లో తీసిన ర‌న్ రాజా ర‌న్‌పై పెట్టిన కాన్‌సంట్రేష‌న్ రెండు సంవ‌త్స‌రాల తీసిన సాహో విష‌యంలో ఎందుకు ఫెయిల్ అయ్యాడు ?  ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ ఎంత దెబ్బ‌కొట్టిందో తెలుస్తూనే ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: