రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా , బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ హీరోయిన్ గా తెరకెక్కిన మోస్ట్ ప్రెస్టీజియస్ చిత్రం సాహో. బాహుబలి తరువాత ప్రభాస్ నటించిన చిత్రం కావడం తో అందరూ ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు. దానికి తగ్గట్టే నిర్మాతలు కూడా 350 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమాని నిర్మించిన సాహో పై అంచనాలని రెట్టింపు చేసారు. దీనికి తోడు సినిమా నుండి వచ్చిన ట్రైలర్స్ , టీజర్స్ అన్ని కుడా సినిమా హాలీవుడ్ రేంజ్ ని తలపించేలా ఉండటంతో అంచనాలు ఊహించని రీతిలో పెరిగిపోయాయి.

సినిమాకి ఉన్న క్రేజ్ దృష్ట్యా నిర్మాతలు కూడా సాహో ని  ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా 10000 థియేటర్లలో భారీ రిలీజ్ చేసారు. ముఖ్యంగా బాలీవుడ్ నే టార్గెట్ చేసుకొని వచ్చిన ఈ సినిమా తొలి రోజు, తొలి షో నుండే పూర్తి డివైడ్ టాక్ తో ఘోరమైన రివ్యూస్ ని పొందింది. ముఖ్యంగా బాలీవుడ్ మీడియా సాహోని ఏకిపారేసింది. సినిమా అనుకున్నంతగా లేకపోవడం తో అభిమానులు కూడా తీవ్ర నిరాశలో కూరుకుపోయారు, బాహుబలి తరువాత రెండేళ్లు కష్టపడి చేసిన సినిమా మరో ఇండస్ట్రీ హిట్ కొడుతోంది అనుకుంటే ... బిగెస్ట్ డిజాస్టర్ దిశగా పోవడాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు. 

సినిమాలో కావాల్సినంత యాక్షన్స్ ఎపిసోడ్స్ తప్ప కథలో కొత్తదనం , సరైన బలం లేకపోవడంతో థియేటర్లలో సాహో తేలిపోయింది. కనీసం హిట్ టాక్ ని కూడా సొంతం చేసుకోలేకపోయింది. దీనితో ఈ సాహో రిజల్ట్ పై డార్లింగ్ ప్రభాస్ రియాక్ట్ అయ్యాడు. అభిమానులకోసమే బాహుబలి తరువాత రెండేళ్లు కష్టపడి ఈ సాహో సినిమాలో నటించాను. కానీ , ఫైనల్ గా మీకు ఈ సినిమా అంతగా నచ్చినట్టులేదు. ఏదేమైనా కూడా సాహో తో అభిమానుల అంచనాలను అందుకోకపోవడం చాల భాదగా ఉంది. ఫుల్ లెన్త్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం పై నెగటివ్ టాక్ అనేది అసలు ఊహించలేదు. ఏదేమైనా కూడా లవ్ యు డార్లింగ్ ...ఈ సినిమా కాకపోతే ఇంకో సినిమాతో అయినా కచ్చితంగా మిమ్మల్ని మెప్పిస్తా అని తెలిపాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: