బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 లో మరో వీకెండ్ వచ్చేసింది. ఈ సీజన్ 3 ఇప్పటికే ఐదు వారాలని పూర్తి చేసుకొని , ఆరో వారాన్ని కూడా పూర్తిచేసుకోబోతుంది. నాగార్జున హోస్ట్ గా ప్రారంభమైన ఈ సీజన్ 3 తోలి రోజే సంచలనమైన టిఆర్పి రేటింగ్ తో బుల్లితెరపై సరికొత్త రికార్డ్స్ సృష్టించి సంచలనంగా మారింది. తెలుగు రియాలిటీ షోస్ ఆదరణ లభించదు అని చెప్పిన వారే ఈ షో పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మొత్తంగా రెండు సీజన్స్ ని ఎంతో సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ..ఈ మూడో సీజన్ కూడా విజయవంతంగా ముందుకుసాగిపోతుంది. 

ఇక వీక్ లో ఐదు రోజుల పాటు హౌస్ మేట్స్ చేసిన రచ్చ పై నేడు నాగార్జున వచ్చి .. ఫుల్ కాల్స్ పీకానున్నాడు. ఈ వీక్ అంతగా గొడవలు జరగలేదు అని చెప్పాలి. బిగ్ బాస్ ఇచ్చిన  చలో ఇండియా టాస్క్ తోనే ఈ వీక్ గడిచిపోయింది అని చెప్పాలి. ఈ టాస్క్ లో బెస్ట్ ఫోర్ఫామెన్స్ ఇచ్చిన బాబా భాస్కర్ , రాహుల్ , వరుణ్ కెప్టెన్ టాస్క్ లో పోటీపడగా వరుణ్ రెండోసారి బిగ్ బాస్ ఇంటి కెప్టెన్ గా ఎంపైకైయ్యాడు. ఆ తరువాత హౌస్ మేట్స్ కి బిగ్ బాస్ ఒక ఫన్నీ లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇచ్చాడు. మొత్తంగా ఈ వీక్ చాల సరదాగా సాగిపోయింది అని చెప్పాలి.

ఇకపోతే ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ నుండి ఐదుగురు హౌస్ మేట్స్ బయటకి వచ్చేసారు. మొదటివారం హేమ , ఆ తరువాత జాఫర్ , తమన్నా , రోహిణి , ఆశు ఎలిమినేట్ అయ్యారు. అలాగే ఈ వారం మొదట్లో ఆరుగురు నామినేషన్స్ లో ఉండగా ..బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ని కంప్లీట్ చేసి వరుణ్ , రాహుల్ , రవి నామినేషన్స్ నుండి బయటపడ్డారు. దీనితో ఈ వారం మహేష్ , హిమజ , పునర్నవి నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో ఎవరు బయటకి వెళ్ళిపోతారో నేడు తేలనుంది. అసలే ముగ్గురే నామినేషన్స్ లో ఉండటం తో ఎలిమినేషన్ టైం లో బిగ్ బాస్ ఏంచేస్తాడో చూడాలి. మరో వైపు ఈ వార అసలు అలిమినేషన్ ఉండకపోవచ్చనే వాదన వినిపిస్తుంది. ఆల్రెడీ ముగ్గురిని సేవ్ చేయడంతో, ఈ వారం ఎలిమినేషన్ ఉండదనే ఊహాగానాలు వస్తున్నాయి. ఈ వారం ఎలిమినేషన్ లేకపోతే వచ్చే వారం ఒకేసారి డబల్ ధమాకా ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే ఆదివారం వరకు వెయిట్ చేయాల్సిందే.
 


మరింత సమాచారం తెలుసుకోండి: