అల్లు అర్జున్ నాపేరు సూర్య పరాజయం తరువాత ఎలాంటి సినిమా చేయాలో అర్ధంగాక చాలా సమయం తీసుకున్నారు.  వరుసగా సినిమాలు చేసి చేతులు కాల్చుకోవడం కంటే సమయం తీసుకొని మంచి సినిమాలు చేయాలని అనుకున్నాడు. అనుకున్నట్టుగా బన్నీ కొన్ని మంచి సినిమాలు ప్లాన్ చేశాడు.  ఇందులో భాగంగా తనకు బాగా నచ్చిన.. కలిసి వచ్చిన.. రెండు హిట్స్ ఇచ్చిన గురూజీ త్రివిక్రమ్ తో సినిమాను ఎంచుకున్నాడు.  


ఈ ఇద్దరి కాంబినేషన్లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమా వచ్చాయి.  ఇప్పుడు అల వైకుంఠపురంలో సినిమా చేస్తున్నారు.  ఫాదర్ సెంటిమెంట్ తో తెస్తున్న సినిమా ఇది.  కథపై నమ్మకంతో సినిమా చేస్తున్నాడు.  గురూజీ డైలాగ్స్ ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు.  అందుకే ఆయనను ఎంచుకున్నారు.  త్రివిక్రమ్ సినిమాతో పాటు వేణు శ్రీరామ్ తో ఐకాన్ కు ప్లాన్ చేశారు.  ఇది కూడా మరికొన్ని రోజుల్లో సెట్స్ మీదకు వెళ్ళబోతున్నది.  


దీంతో పాటు సమాంతరంగా ఆర్య వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన సుకుమార్ తో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు బన్నీ. ఈ మూవీ, వేణు శ్రీరామ్ ఐకాన్ సినిమా రెండు వరసగా షూటింగ్ లు జరుగుతాయి.  రెండింటిని వరసగా చేయాలని నిర్ణయం తీసుకున్న బన్నీ, ఇప్పుడు మరో నిర్ణయం కూడా తీసుకున్నారు.  అదేమంటే.. తెలుగుతో పాటు తమిళంలో కూడా స్ట్రెయిట్ మూవీ చేయాలనీ.. తమిళంలో అల్లు అర్జున్ సినిమాలు బాగా ఆడతాయి.  అక్కడ ఫ్యాన్స్ ఉన్నారు.  


అందుకోసం దర్శకుడు మురుదాస్ తో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.  మురుగదాస్ గతంలో మెగాస్టార్ తో స్టాలిన్ సినిమా చేశారు.  అంతకు ముందు గజినీ సినిమాను తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్లో రిలీజ్ అయ్యింది.  ఆ సినిమా తెలుగులోనూ పెద్ద హిట్ అయ్యింది.  ప్రస్తుతం మురుగదాస్ రజినీకాంత్ తో దర్బార్ సినిమా చేస్తున్నారు.  ఈ మూవీ పూర్తయ్యాక బన్నీసినిమాకోసం కథపై కూర్చుంటారని తెలుస్తోంది.  ఇద్దరి కాంబినేషన్లో సినిమా సెట్టైతే.. బన్నీ కల నెరవేరినట్టే అవుతుంది.  సో, సినిమాలు లేకుండా చాల సమయం వేచి చూసిన బన్నీ... ఇప్పుడు వరసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుండటం విశేషం.  


మరింత సమాచారం తెలుసుకోండి: