మాటల మాంత్రికుడుగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ తన మాటలతోనే సినిమాను  నడిపించగల సమర్థుడు. ఆయన సినిమాల్లో పనిమనుషులు సైతం పంచ్ లు వేసేస్తుంటారు. పంచ్ అనే టాపిక్ పుట్టుక రావడానికి త్రివిక్రమ్ గారే కారణం. అయితే త్రివిక్రమ్ గత కొన్ని రోజులుగా సరైన హిట్ రాలేదు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన అజ్ఞాతవాసి బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ఆ సినిమాలో త్రివిక్రమ్ మాటలు కూడా పేలలేదు.


అయితే ఈ సినిమాకి సంగీతం అందించిన అనిరుధ్ మీద త్రివిక్రమ్ పంచ్ వేశాడు. అనిరుధ్ తమిళంలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్. 17 ఏళ్ల వయసులో అతను కంపోజ్ చేసిన ‘కొలవెరి’ పాటతోనే అందరికీ అర్థమైంది. ఆ తర్వాత అతను మరెన్నో అద్భుతాలు చేశాడు తమిళంలో. ఈ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్‌ను తెలుగులోకి తేవాలని ముందుగా ప్రయత్నించింది త్రివిక్రమ్ శ్రీనివాసే. అఆ’ సినిమాకే అతడితో మ్యూజిక్ చేయించుకోవాలనుకున్నాడు. కానీ కుదర్లేదు.


తర్వాత ‘అజ్ఞాతవాసి’కి పట్టుకొచ్చాడు. అనిరుధ్ తమిళంలో ఇచ్చిన ఆడియోల స్థాయిలో ‘అజ్ఞాతవాసి’ పాటలు లేకపోవచ్చు కానీ.. మరీ తీసిపడేసే పాటలు మాత్రం కావవి. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగానే చేశాడు. సినిమాలో విషయం లేనపుడు అసలు ఆర్ఆర్ ఎలా ఉందని పట్టించుకునేవాడెవడు? ఐతే ఈ చిత్రం డిజాస్టర్ కావడానికి కారణాలు వేరు. కానీ దాని క్రెడిట్ అనిరుధ్‌కు కూడా పంచేశాడు త్రివిక్రమ్.


అనిరుధ్ కి తెలుగు ప్రేక్షకుల టేస్ట్ తెలియదంటూ కామెంట్ చేశాడు. దీంతో అనిరుధ్ హర్ట్ అయినట్టున్నాడు. మొన్న వచ్చిన జెర్సీ కి ఆయన అందించిన మ్యూజిక్ ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ చేసిన హెల్ప్ అంతా ఇంతాకాదు. దీంతో త్రివిక్రమ్ మాటలు తప్పు అని రుజువైంది. అదీగాక ప్రస్తుతం బన్నీ ఐకాన్ కి కూడా అనిరుధ్ సంగీతం అందించబోతున్నట్లు సమాచారం. ఒకవేళ అదే జరిగితే త్రివిక్రమ్ కి పంచ్ పడినట్లే. 



మరింత సమాచారం తెలుసుకోండి: