సాయిపల్లవి అంటే హీరోయిన్ గా ఎవరూ చూడరు, ఆమెను మన పక్కింటి అమ్మాయిగానే భావిస్తారు. తెలుగులో జయసుధ తరువాత సహజంగా నటించే హీరోయిన్  గా సాయిపల్లవిని చెబుతారు. ఈ అమ్మడు చేసిన పాత్రలే కళ్ళ ముందు కదలాడుతాయి తప్ప ఆమె ఎక్కడా  గుర్తుకు రాదు అంటే ఎంత టాలెంటెడ్ ఆర్టిస్టో  అర్ధం చేసుకోవాలి. ఫిదా మూవీలో సాయిపల్లవిని ఎవరైనా మరచిపోగలరా. ఆలా హంట్ చేసే రోల్స్ సాయిపల్లవికే ఎందుకు దక్కుతాయి.


అంటే ఆమె ఆ పాత్రలను ఏరి కోరి తెచ్చుకుంటుంది కాబట్టి. ఆమెకు హీరోతో సంబంధం లేదు, డైరెక్టర్ బడానా, చోటానా అన్నది అంతకంటే లెక్క లేదు. ఆమెకు కావాల్సింది తన పాత్ర. అది కూడా అసభ్యతకు తావులేకుండా ఉండాలి. దాన్ని జనమంతా మెచ్చుకోవాలి. పది కాలాలు గుర్తుండిపోవాలి. ఇవీ సాయిపల్లవి కండిషన్లు


పైగా ఈ రోజుల మాదిరిగా అందాల ఆరబోతకు సాయిపల్లవి మొదటే నో చెబుతుంది. తాను అలాంటి వాటికి దూరం అంటుంది. లేకపోతే   సాయి పల్లవి క్రేజ్ కి ఈ పాటికి సౌతిండియాలోనే నంబర్ వన్ గా నిలిచేది. మళయాళం మూవీ ప్రేమం  ద్వారా ఎంట్రీ ఇచ్చిన సాయిపల్లవి చేసినవి చేస్తున్నవి తక్కువ సినిమాలే. అందుకు ఆమె ప్రాత్రల పట్ల కచ్చితమైన ఎంపిక, కండిషన్లే కారణం.


ఆమె వరసగా మూడు భారీ ఆఫర్లను తిరస్కరించిందంటే నమ్ముతారా. కానీ ఇది నిజం. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గీతా గోవిందం మూవీలో గీత పాత్రకు మొదట సాయిపల్లవినే అనుకున్నారట. అయితే అందులో లిప్ లాక్ సీన్లు ఉంటాయని తెలిసి నో చెప్పేసిందట. అలాగే అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో మూవీలో కూడా సాయిపల్లవిని అనుకుంటే హీరోయిన్ కి నటించేందుకు స్కోప్ లేదని వద్దనుకుందట. ఇక అఖిల్ మూవీకి కూడా సాయిపల్లవి నో అనడానికి తన పాత్ర గురించి ఆలోచించడమే కారణం అంటున్నారు.


మొత్తానికి సెలెక్టివ్ గా మూవీస్ చేస్తూ వస్తున్న ఈ మళయాళ కుట్టికి కధ, తన పాత్ర చాలా ముఖ్యమని అంటోంది. అవి లేకపోతే తాను నో అనేస్తుందట. ఓ విధంగా సాయిపల్లవి చేస్తున్నది కరెక్టే. కానీ ఇపుడున్న స్పీడ్ యుగంలో హీరొయిన్ల మధ్య ఉన్న పోటీలో ఆమె ఇలా చేసి కూడా డిమాండ్ ఎక్కడా తగ్గించుకోకపోవడం మాత్రం గ్రేట్ అంటున్నారు. ఆమె నటనతోనే ఫిదా చేయడం వల్లనే అంతా క్యూ కడుతున్నారని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: