ప్రభాస్,శ్రద్ధాకపూర్ జంటగా,సుజిత్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సాహో చిత్రంపై సినీ విమర్శకులు,ప్రేక్షకులు పెదవి విరిచారు.దాంతో తొలి ఆట నుంచే సాహో చిత్రం మిక్స్‌డ్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకొన్నది.అయినా సాహో చిత్రం మధ్యాహ్నం షో నుంచి ఫస్ట్,సెకండ్ షోలకు ఆక్యుపెన్సీ రేట్‌ను పెంచుకొంటూ పోయింది.దాంతో దేశవ్యాప్తంగా భారీ వసూళ్లు నమోదయ్యాయి.కొన్ని చోట్ల ప్రింట్లు అందకపోవడం వల్ల వసూళ్లపై ప్రభావం పడిందనే మాట వినిపిస్తున్నది.సాహో హిందీ వెర్షన్‌కు భారీగా స్పందన వచ్చింది.ముంబై, గుజరాత్, మరట్వాడా ప్రాంతాల్లో ఈ చిత్రానికి అనూహ్య స్పందన కనిపిస్తున్నది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ చిత్రం మొదటి రోజు రూ.25 కోట్ల వసూళ్లను కలెక్ట్ చేసింది.



నాన్ హాలీడే రోజున సాహో చిత్రం ఈ రేంజ్‌లో వసూళ్లను రాబట్టడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.ఉత్తరాదిలోని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ప్రింట్స్ సమస్య తలెత్తడం వసూళ్లలో తగ్గుదల కనిపించదనే మాట వినిపిస్తున్నది..తొలి రోజున చెన్నై లో భారీగా కలెక్షన్లను సాధించింది.తమిళ వెర్షన్‌లో ఈ చిత్రం 32 లక్షల రూపాయలు వసూలు చేసింది,ఇక చెన్నైలో రూ.73 లక్షలవసూళ్లను సాధించడం రికార్డుగా చెప్పుకొంటున్నారు.భరత్ అనే నేను (27 లక్షలు) కలెక్షన్లను,స్పైడర్ (65 లక్షలు) వసూళ్లను కూడా దాటేసింది.ఇక ఓవర్సీస్ మార్కెట్ విషయానికి వస్తే,యూఎస్‌లో సాహో చిత్రం రికార్డు వసూళ్లను సాధించి తొలిరోజు 1 మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరింది.ఇక ఆస్ట్రేలియాలో మహర్షి రికార్డులను కూడా అధిగమించింది.ఇక సినిమా స్టామినాకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో సాహో నాన్ బాహుబలి రికార్డును క్రియేట్ చేసింది.



తొలి రోజున బాహుబలి చిత్రం రూ.36,09,236 వసూలు చేస్తే, సాహోచిత్రం రూ.34,29,293 కలెక్ట్ చేసింది.అజ్ఞాతవాసి చిత్రం 28,96,772. మహర్షిచిత్రం రూ.28,78,265 వసూలుచేసిన సంగతి తెలిసిందే.ఇక తెలుగు రాష్ట్రాల్లో సాహో చిత్రం తొలిరోజున భారీగానే వసూళ్లను సాధించినట్టు తెలుస్తున్నది.ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వసూళ్లు ఇంకా అందాల్సి ఉంది. వారాంతంలో సాహో చిత్రం వసూళ్లు పెరిగే అవకాశం ఉందనే మాట వినిపిస్తున్నది.మొత్తానికి ఈ వీక్‌లో అసలు ఎంత కొసరు ఎంత అనేది తెలిసిపోతుందంటున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: