ఆరవై ఏళ్ల వయసులో కూడా కుర్రాడిలా అన్ని చేస్తాడు.. యువ హీరోలు సైతం ఈయనతో పోటీ పడలేము బాబు అనుకునేలా చేస్తారు అయన. వయసు పై బడిన కూడా నేను ఇంకా పిల్లాన్ని అంటూ.. ఈ వయసులో కూడా మన్మథుడిలా చేస్తారు. ఇన్ని అన్నప్పుడు మీకు గుర్తొచ్చే పేరు తెలుగు మన్మథుడు కింగ్ అక్కినేని నాగార్జున. 

నాగార్జున వయసు పెరిగిన కూడా ఏ మాత్రం తరగని అందంతో అమ్మాయిల గుండెల్లో ఉండటమే కాకుండా, తెలుగు ఇండస్ట్రీని కూడా దున్నేస్తున్నారు. మాస్ అయిన, క్లాస్ అయిన, రొమాంటిక్ ఇలా ఏది చూసుకున్న కూడా నాగ్ నటన పీక్స్ లో ఉంటుంది. తాజాగా వచ్చిన మన్మథుడు 2 సినిమాలో శృతి మించిన రొమాన్స్ తో నాగ్ అందరిని ఆకట్టుకోవాలని అనుకున్నారు. కానీ, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డీలా పడటమే కాకుండా, ఈ వయసులో నీకు ఇది అవసరమా నాగ్ అంటూ అందరి చేత ట్రోల్స్ వేయిచుకున్నారు. 

అసలు విషయానికొస్తే..  ఈ నెల 29 న నాగ్ పుట్టిన రోజును తన కుటుంబ సభ్యులతో కలిసి స్పెయిన్ లో జరుపుకున్నాడు. ఆ ఫోటోలను అభిమానులకు షేర్ చేశారు నాగ్.. వాటికీ స్పందించిన అయన అభిమానులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు సక్సెసఫుల్ హీరోయిన్ గా దూసుకు పోతున్న సమంత.. అక్కినేని ఇంట కాలు పెట్టిన సంగతి తెలిసిందే.. ఆమె కూడా ఈ పుట్టిన రోజు వేడుకలలో ముందుంది.

మూడు రోజుల నుండి స్పెయిన్ లో విహరిస్తున్న ఈ ఫ్యామిలీ ఫోటోలను క్లిక్ మనిపిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. వాటికి ఫ్యాన్స్ కామెంట్లు కూడా పెడుతున్నారు. సామ్ కూడా పోస్ట్ చేస్తూ వస్తుంది. ఇకపోతే అమల పక్క నుండగానే నాగ్ అక్కడ అమ్మాయిలతో ఫోటోలను దిగి ఇప్పటికీ నేను మన్మథుడినే అని నిరూపించారు. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో దర్శనమిస్తుంది..  అలాగే చక్కర్లు కొడుతుంది కూడా.. 


మరింత సమాచారం తెలుసుకోండి: