‘బిగ్ బాస్ 3’ షోకు ఊహించిన స్థాయిలో క్రేజ్ రాకపోవడంతో ఈషో పై బుల్లితెర ప్రేక్షకులలో క్రేజ్ పెంచడానికి ‘బిగ్ బాస్’ షో నిర్వాహకులు ఒక ఊహించని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ షోకు సంబంధించి వైల్డ్ కార్డ్ ఎంట్రీ పద్ధతి ద్వారా ఒకప్పుడు హీరో వరుణ్ సందేశ్ తో పీకలలోతు ప్రేమ వ్యవహారం నడిపి ఆ తరువాత విడిపోయిన హీరోయిన్ శ్రద్ధా దాస్ ను వైల్డ్ కార్డ్ ఎంట్రీగా బిగ్ బాస్ షోలో ప్రవేశపెట్టి వరుణ్ సందేశ్ వితికల మధ్య చిచ్చుపెట్టి ఈ షోకు రేటింగ్స్ పెంచుకోవాలని ‘బిగ్ బాస్’ షో నిర్వాహకులు ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

వాస్తవానికి ఈ షోకి సంబంధించి రెండవ వారంలోనే ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రిని ఎంటర్ చేసి ఈ షోకు రేటింగ్స్ పెంచాలని చాల ప్రయత్నాలు చేసారు. తమన్నా కూడ తన ప్రవర్తనతో ఈ షోలో కొన్ని వివాదాలు సృష్టించినా బుల్లితెర ప్రేక్షకులకు మాత్రం తమన్నా ఏమాత్రం కనెక్ట్ కాలేకపోయింది. 

దీనితో ఈ షో నిర్వాహకులు మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ప్రయోగాన్ని తెరపైకి తీసుకు వస్తున్నారు. ప్రస్తుతం ఈ షోలో చాల సేఫ్ గేమ్ ఆడుతున్న వరుణ్ సందేశ్ వితిక లను ఇరుకున పెట్టాలి అంటే అది శ్రద్ధా దాస్ వల్లే అవుతుందని ఇప్పుడు ఈమెను ఎంటర్ చేస్తున్నారు. 

గతంలో శ్రద్ధా దాస్ వరుణ్ సందేశ్ లు 2010లో ‘మరో చరిత్ర’ అన్న సినిమాలో నటించారు. ఆ సినిమా షూటింగ్ లోనే వీరిద్దరి పరిచయం ప్రేమగా మారి ఆతరువాత కొన్ని కారణాలతో బ్రేకప్ కు దారితీసింది. ఈ వ్యవహారం వల్ల శ్రద్ధా దాస్ బాగా అప్పట్లో వరుణ్ సందేశ్ పై రగిలి పోయింది అన్న వార్తలు కూడ వచ్చాయి. ఇప్పడు ఆ విషయాలను శ్రద్ధా దాస్ మరిచిపోయినట్లు కనిపిస్తుందా లేకుంటే వరుణ్ సందేశ్ ను టార్గెట్ చేసి ఈషో నుండి ఎలిమినేట్ అయ్యేలా శ్రద్ధా దాస్ కుట్రలు చేస్తుందా అన్న ఆసక్తి బుల్లితెర ప్రేక్షకులలో పెరిగిపోతుంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: