ఒకరు క్రియోట్ చేసిన రికార్డులు ఎప్పుడూ శాశ్వతం కాదు. ఈ విషయం అన్ని చిత్ర పరిశ్రమలలో ఎప్పటికప్పుడు నిరూపితం అవుతూనే న్నాయి. అది యంగ్ హీరోస్ నుండి స్టార్ హీరోస్ నటించిన ఎలాంటి సినిమా అయినా. నిన్నటి రికార్డు ఈ రోజు రిలీజైన సినిమా బద్దలుకొడుతుంది.. లేకపోతే రేపు బద్దలుకొడుతుంది.  అయితే కొన్ని రికార్డులు మాత్రం చాలా కాలం పాటు అలానే కొనసాగుతాయి. ఏ సినిమా కూడా గత సినిమాల రికార్డ్ లను బ్రేక్ చేయడం అంత సులభంగా సాధ్యమవదు. బాహుబలి 2 రికార్డులు అలాంటివే. బాహుబలి 2 సాధించిన బాక్స్ ఆఫీస్ రికార్డులు అసామాన్యమైనవి. తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డు తీసుకుంటే అది కూడా బాహుబలి 2 పేరు మీద ఇంకా చరగకుండా అలానే ఉంది.  

ఇక టాప్ ఫైవ్ లిస్టులో 'బాహుబలి 2' తర్వాత తారక్-త్రివిక్రం కాంబినేషన్ లో వచ్చిన 'అరవింద సమేత' (26.6 కోట్లు)..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-త్రివిక్రం ల 'అజ్ఞాతవాసి' (26.36 కోట్లు)..బోయపాటి-చరణ్ ల 'వినయ విధేయ రామ' (26.03 కోట్లు) కాగా వంశీ పైడిపల్లి-సూపర్ స్టార్ మహేష్ ల మహర్షి (24.18 కోట్లు) సినిమాలు ఉండేవి. అయితే తాజాగా ప్రభాస్ 'సాహో' ఈ లిస్టులో రెండవ స్థానం సాధించింది. 'సాహో' తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ రూ.36 కోట్లు. దీంతో రెండవ స్థానంలో ఉన్న 'అరవింద సమేత' ను మూడవ స్థానానికి నెట్టి రెండవ స్థానంలో సాహో నిలవడం గొప్ప విషయం. ఇక ఈ లిస్టులో ఐదవ స్థానంలో ఉన్న 'మహర్షి' ఆరవ స్థానానికి పడిపోయింది. దీంతో మహేష్ బాబు సినిమా టాప్ 5 లిస్టులో స్థానం కోల్పోయింది.  

ఈ టాప్ ఫైవ్ లో లిస్టులో స్థానం లేని టాప్ లీగ్ హీరోలు మహేష్ బాబు.. అల్లుఅర్జున్ మాత్రమే.  ఈ ఇద్దరూ సంక్రాంతికి తమ కొత్త సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మరి ఇద్దరిలో ఎవరి సినిమాలు ఈ లిస్టులోకి ఎంట్రీ ఇస్తాయో చూడాలంటే 2020 వరకు ఆగాల్సిందే. ఇక ఇదే సంక్రాంతి బరిలో బాలయ్య సినిమా తో పాటు సూపర్ స్టార్ రజనీ కాంత్ దర్బార్ కూడా నిలవనుందని ఇప్పటికే తెలిసిన విషయం. 


మరింత సమాచారం తెలుసుకోండి: