భారీ బడ్జెట్, భారీ స్టార్ కాస్టింగ్ తో సినిమా తీసేప్పుడు ఇప్పటి నుంచి మన దర్శక, రచయితలు బాగా గుర్తుంచుకోవాల్సిన మొట్ట మొదటి సూత్రమేంటో ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసింది. ఇన్నాళ్లు తెలుగు సినిమాల్లో కాపీ కంటెంట్ వివాదాలు కేవలం పక్క రాష్ట్రాల్లోనే వినిపించేవి. కానీ ఇప్పుడు అది ఖండాంతరాలకు సరిహద్దులు దాటి వెళ్లిపోతోంది. ఎక్కడో విదేశాల్లో ఉన్న సినీప్రముఖులు కూడా మన సినిమాలపై గట్టిగా కామెంట్లు చేసేస్తున్నారు. కాపీ కొట్టేశారంటూ వివాదాన్ని రేపుతున్నారు. దీనివల్ల మన సినీ పరిశ్రమ పరువు, మర్యాదలే గంగలో కలుస్తున్నాయి. క్రియోటివ్ గా సినిమా తీసే వాళ్ళకు ఇది అంత మంచిది కాదనే సంకేతాలు వస్తున్నాయి.
 
తాజాగా రిలీజైన భారీ బడ్జెట్ సినిమా సాహో పైన ఇలాంటి వివాదమే మొదలైంది. ఈ సినిమా కంటెంట్ చూస్తుంటే కాస్త అటూ ఇటూగా పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి' ని పోలి ఉందని విమర్శలు వచ్చాయి. ఈ సందర్భంగా అజ్ఞాతవాసి స్ఫూర్తి అయిన లార్గో వించ్ గురించి ప్రస్థావన వచ్చింది. అయితే ఆ మాట సోషల్ మీడియాల ద్వారా లార్గో వించ్ దర్శకుడు జెరోమ్ కి చేరిపోవడంతో మరోసారి అతను చెలరేగిపోయాడు. నాకు ఇండియాలో ప్రామిస్సింగ్ కెరీర్ ఉన్నట్టుంది! అంటూ పంచ్ వేసేశాడు. మన మేకర్స్ పై వెటకారంగా ఈ పంచ్ లు వేశాడని తెలియడానికి ఇంకేం కావాలి.

'అజ్ఞాతవాసి' మేయిన్ స్టోరీ ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు జెరోమ్ సల్లే తెరకెక్కించిన లార్గో వించ్ సినిమా నుంచి ఎత్తుకొచ్చిన కథ అంటూ అప్పట్లో ప్రచారమైంది. ఆ తర్వాత దాని గురించి పెద్ద ఎత్తున చర్చ కూడా సాగిన విషయం తెలిసిందే. బెల్జియం నవల లార్గో వించ్ ఆధారంగా అదే టైటిల్ తో రూపొందించిన సినిమా అది. తాజాగా సుజీత్ ఎంచుకున్న థీమ్ కూడా ఇంచుమించు అలానే ఉందని తెలుగు సోషల్ మీడియాలో విశ్లేషణలు వెలువడడం.. అది కాస్తా అంతర్జాతీయంగానూ పాపులరైపోవడం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. అందుకే కనీసం భారీ బడ్జెట్లతో పెద్ద స్థాయిలో సాహసం చేసేప్పుడు అయినా ఒరిజినల్ కంటెంట్ కోసం పూర్తి స్థాయిలో మన దర్శక, నిర్మాతలు ఎఫర్ట్ పెడితే బావుంటుందేమోనని ఇప్పుడు చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఇక సామాజిక మాధ్యమాల వెల్లువలో మంచి కంటే చెడు ఎక్కువగా జరుగుతోంది కాబట్టి ఆ విషయం దృష్ఠిలో పెట్టుకొని మన మేకర్స్ కూడా జాగ్రత్త పడాలి. లేదంటే చివరికి ఘోరంగా బుక్కయ్యేది నిర్మాతలే. ఇక ఏదిఏమైనా కేవలం రెండే సినిమాల అనుభవంతో సుజీత్ సాహోని బాగానే డీల్ చేశాడని వినిపిస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: