ఒక సినిమా సూపర్ డూపర్ హిట్టయిందంటే ఆ సినిమా రీమేక్ హక్కులను చేజిక్కించుకోవడానికి ఒకేసారి ఇద్దరు ముగ్గురు టాప్ ప్రొడ్యూసర్లు బాగా పోటీ పడతారు. ఇది ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా సహజం. అయితే గత కొన్ని రోజులుగా నానుతున్న బాలీవుడ్ సినిమా వ్యవహారం మొత్తానికి సెటిల్ అయింది. ఎంతోమంది పోటీపడినా, ఆఖరికి అంథదూన్ హిందీ సినిమా హక్కులు సుధాకర్ రెడ్డి-టాగోర్ మధుకే దక్కాయి. దీంతో ఆ సినిమా రీమేక్ కు అన్నీ రకాలుగా సనాహాలు మొదలుకాబోతున్నాయి. నితిన్ హీరోగా ఈ సినిమాను రీమేక్ చేయడానికి డిసైడ్ అయి, హక్కుల కోసం ట్రయ్ చేసారు కాబట్టి, ఇక హీరో ఎవరు అన్న క్వశ్చను లేనేలేదు.

నితిన్ ప్రస్తుతం మూడు సినిమాలు ఓకె చేసాడన్న సంగతి తెలిసిందే. భీష్మ సినిమా దాదాపు 60% పైగా పూర్తయింది. చంద్రశేఖర్ యేలేటి సినిమా ఒక షెడ్యూలు పూర్తయిందని కూడా తెలుస్తోంది. వెంకీ అట్లూరి కాంబినేషన్ లో రంగ్ దే సినిమా స్టార్ట్ కావాల్సి వుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. భీష్మ సినిమా పూర్తయిన తరువాత మిగిలిన రెండు సినిమాల గ్యాప్ లో అంథదూన్ రీమేక్ చేస్తాడని లేటెస్ట్ న్యూస్ ఫిల్మ్ నగర్ లో బాగా వినిపిస్తోంది.

అయితే తెలుగు రీమేక్ ను ఎవరు డైరెక్ట్ చేస్తారు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది. సుధీర్ వర్మ పేరు వినిపిస్తోంది. కానీ వరుసగా మూడు ఫ్లాపులు ఇచ్చిన ఆయన ట్రాక్ రికార్డు దృష్ట్యా ఆ అవకాశం వుండకపోవచ్చునని సమాచారం. ఆ మధ్య వచ్చిన ఏజెంట్ శ్రీనివాస్ సినిమా డైరక్టర్ వివేక్ పేరు కూడా వినిపిస్తోంది. మరి ఎవరు ఫైనల్  గా ఈ సినిమాకి కెప్టెన్ అవుతారో త్వరలోనే తెలియనుంది. మొత్తం మీద నితిన్ వరుసగా సినిమాలను లైన్ లో పెట్టి ఒకదాని తర్వాత ఒకటి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి గట్టిగానే ప్లాన్ చేసుకున్నాడు. మరి ఈ సినిమాలలో నితిన్ కి ఎన్ని హిట్స్ పడతాయో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: