ఆదివారం వస్తే అందరు ఇంట్లో హ్యాపీగా కూర్చుంటారు.  బన్నీ మాత్రం తన ఫ్యాన్స్ కోసం ఓ స్పెషల్ వంటకాన్ని తీసుకొని వచ్చారు.  త్రివిక్రమ్ వంటల పుస్తకంలోనుంచి అల వైకుంఠపురంలో మాస్ క్లాస్ మసాలాలు దట్టించి ఫస్ట్ లుక్ పోస్టర్ అనే వంటకాన్ని తయారు చేశారు.  కిచెన్ లోనుంచి వచ్చిన ఆ సువాసనలు తెలుగు రాష్ట్రాల్లోని బన్నీ అభిమానులను నిద్రలేపాయి.  ఆదివారం బద్దకంగా నిద్రపోతున్న నెటిజన్లకు గుడ్ మార్నింగ్ అలారంగా మోగింది.  


నిత్యం ఆఫీస్ లో సతమతమయ్యి కాస్త రిలాక్స్ అవుదామని అనుకుంటున్న ఉద్యోగులను బాబు ఇటువైపు చూడండి రిలాక్స్ అవ్వండని చెప్తున్నట్టు ఉన్నది. త్రివిక్రమ్ పుస్తకంలో చూసి బన్నీ వండిన కొత్త వంట అల వైకుంఠపురంలో ఫస్ట్ లుక్ పోస్టర్.  క్లాస్ మాస్ అందరికి నచ్చే విధంగా డిజైన్ చేశారు.  బన్నీ క్లాస్ గా హై క్లాస్ కార్లో వచ్చి.. మాస్ గా ఓ స్టూల్ పై కూర్చిని బీడీ నోట్లో పెట్టుకొని సెక్యూరిటీ చేత నిప్పు వెలిగించుకొన్న ఫోటో అది. 


అదిరిపోయింది.  వెనుక భారీ బిల్డింగ్.. హై క్లాస్ కార్.. బన్నీ సూట్ లో సూపర్ గా ఉన్నాడు.  క్లాస్ మాస్ మిక్స్ చేసి అద్భుతంగా ఉన్నాడు.  ఈ ఫోటో చూస్తే.. సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్ధం అవుతుంది.  ప్రస్తుతం త్రివిక్రమ్ వేడివేడిగా అల వైకుంఠపురం వంటలను రెడీ చేస్తున్నారు.  రెడీ చేస్తున్న వంట వచ్చే ఏడాది సంక్రాంతికి రుచి చూపుతారట.  పూజ హెగ్డే హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాలో టబు ఓ కీలక పాత్ర చేస్తున్నది.  జయరాం మరో కీలక పాత్ర చేస్తున్నాడు.  


థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలోని చిన్న క్లిప్ ను ఇటీవలే ఆగష్టు 15 వ తేదీన రిలీజ్ చేశారు. ఆ లుక్ లో బన్నీ మాస్ లుక్ తో అదరగొట్టాడు.  ఈ ఫొటోలో క్లాస్ టచ్ ఇచ్చాడు.  దీనిని బట్టి చూస్తే.. ఇందులో బన్నీ క్లాస్ గా కనిపిస్తూనే మాస్ గా కనిపిస్తున్నాడేమో అనిపిస్తుంది. ఫాదర్ సెంటిమెంట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలా ఉండబోతుంది అన్నది తెలియాలంటే వచ్చే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: