టెక్నాలజీ ఎక్కడికి తీసుకెళ్తుందో ఏమో గాని ప్రాణాలమీదకు మాత్రం తీసుకొస్తుంది. ఇక మొబైల్ వాడకం ఎలా ఉందంటే తిండి తిప్పలు మానుకుని రోజులో సగానికి సగం మొబైల్, కంప్యూటర్లలోనే బ్రతికేస్తున్నారు. ఇక ఇటీవల హైలైట్ అయిన విషయం ఏమన్న ఉందంటే అది గేమ్ పబ్‌బీ  గేమ్ అని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ గేమ్ కారణంగా కొందరు ప్రాణాలు వదలగా..మరికొందరు మతిస్థిమితం కోల్పోయిన వాళ్ళు లేకపోలేదు. ఇక తాజాగా  మరో విషాదం చోటుచేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయ్. 


ఇటీవల ఆన్‌లైన్ యువతను బాగా ఆకర్షిస్తున్న గేమ్ పబ్‌బీ. హింసను ప్రేరేపించేలా రూపొందించిన ఈ గేమ్‌ ఒక్కసారి ఆడితే దానికి బానిస కావాల్సిందే. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్న వారిలో ఈ ఆటల గురించి తెలియని వారుండరు. ప్రధానంగా యువతను ఉర్రూతలూగిస్తున్న ఆన్‌లైన్‌ ఆటలివి. కొందరు చిన్నారులు, యువకులు నిద్రాహారాలు మానేసి ఈ ఆటలకు బానిసలవుతున్నారు. సరదాగా మొదలై అతి తక్కువ కాలంలోనే యువతను తనకు బానిసను చేసుకుంటున్న క్రీడ.

ఇక తాజగా ఈ డేంజరస్ గేమ్ కి బానిసై ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు వనపర్తికి చెందిన కేశవర్ధన్. వనపర్తికి చెందిన కేశవర్ధన్ అనే యువకుడు డిగ్రీ చదువుతున్నాడు. అయితే రెండు నెలలుగా అదేపనిగా పబ్జీ గేమ్‌ ఆడటంతో కాళ్లు, చేతులు చచ్చుబడ్డాయి. నిద్రాహారాలు మానేడయంతో విద్యార్థి మెదడులో బ్లాక్స్‌ ఏర్పడ్డాయి.  దీంతో ఆ యువకుడికి వైద్యులు అత్యవసర చికిత్స అందించారు.


ఆన్లైన్ గేమ్స్ ఆడడం వలన ఎందరో యువకులు వారి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు ఇది ఇలాగే కొనసాగితే ఎందరికో ఆరోగ్యరీత్యా సమస్యలు పెరిగి వారి భవిష్యత్తును నాశనం చేసే అవకాశాలు ఉన్నాయి. ఎవరో బలవంతంగా ఆపే విషయం కాదు కాబట్టి ఎవరికి వారే వారి పైన స్వయం నియంత్రణను ఏర్పరచుకొని ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి అని డాక్టర్స్ కూడా సూచిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: