కన్నడ పరిశ్రమ నుండి వచ్చి తెలుగులో స్టార్ క్రేజ్ దక్కించుకుంది రష్మిక మందన్న. ఛలో, గీతా గోవిందం సినిమలాతో యూత్ ను అలరించిన ఈ బ్యూటీ రీసెంట్ గా డియర్ కామ్రేడ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాల్లో నటిస్తుంది రష్మిక మందన్న.


ఎక్కడ నుండి వచ్చినా సరే మాత్రు భాష మీద మమకారం ఉంటుంది. అయితే రష్మికకు అది లేదంటూ కన్నడిగులు కామెంట్స్ చేస్తుంటారు. డియర్ కామ్రేడ్ ప్రమోషన్స్ లో తనకు కన్నడ సరిగా రాదంటూ రష్మిక మాట్లాడిన తీరు కన్నడ ప్రేక్షకులను హర్ట్ చేసింది. అయితే ఇదే విషయంపై అప్పుడు రెస్పాండ్ అవని కె.జి.ఎఫ్ స్టార్ యశ్ రీసెంట్ గా కిస్ ఆడియోలో స్పందించారు.


కిస్ సినిమాలో నటించిన శ్రీలీలాపై ప్రశంసల వర్షం కురిపించిన యశ్ ఆమె కన్నడలోనే కాదు మిగతా భాషలల్లో సినిమాలు చేయాలని అనారు. అయితే ఎక్కడకి వెళ్లినా మూలాలను మాత్ర్మ్ మరచిపోవద్దని అన్నారు యశ్. కె.జి.ఎఫ్ స్టార్ అలా మాట్లాడింది రష్మికను ఉద్దేశించే అంటూ కామెంట్స్ వస్తున్నాయి.


కన్నడలో కన్నా రెమ్యునరేషన్ ఎక్కువ ఇస్తున్నారన్న కారణంతో రష్మిక తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తుంది. అందుకే కన్నడ సిని ఫ్యాన్స్ రష్మిక మీద కోపంగా ఉన్నారు. అయితే తను ఏ భాషలో చేసినా కన్నడ పరిశ్రమ తనకు స్పెషల్ అంటూ ఎప్పుడు రష్మిక చెబుతూ వస్తుంది. మరి రష్మికని ఉద్దేశించి అన్నాడా లేక రష్మికలా ఎవరు మాట్లాడకూడదని అన్నాడో తెలియదు కాని యశ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిజంగానే యశ్ రశ్మిక మీద అంత కోపంగా ఉన్నాడా ఆయన మాటలు ఆమెను ఉద్దేశించే అయితే ఈ కామెంట్స్ పై రష్మిక ఎలా స్పందిస్తుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: