టాలీవుడ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా వచ్చిన మాస్ మహరాజా రవితేజ తర్వాత చిన్న చిన్న పాత్రల్లో నటించడం మొదలు పెట్టారు.   పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇడియట్ సినిమాతో రవితేజ హీరోగా మారారు.  ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో విక్రమార్కుడు,  శ్రీను వైట్ల దర్శకత్వంలో దుబాయ్ శీను ఇలా వరుసగా విజయాలు అందుకుంటూ వచ్చాడు.  బాబీ దర్శకత్వంలో పవర్ సినిమాతో విజయం అందుకున్న రవితేజ తర్వాత వచ్చిన సినిమాలు వరుసగా డిజాస్టర్స్ అయ్యాయి. అంతే కాదు బెంగాల్ టైగర్ సినిమాలో రవితేజ లుక్ పై చాలా విమర్శలు వచ్చాయి.  దాంతో రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నాడు రవితేజ. 

అనీల్ రావిపూడి దర్శకత్వంలో ‘రాజా ది గ్రేట్’సినిమాతో సూపర్ విజయం అందుకున్నాడు.   ఇక రవితేజ కు ఎదురు లేదు అనుకుంటున్న సమయంలో తర్వాత వచ్చిన మూడు సినిమాలు భారీ డిజాస్టర్ గా మిగిలాయి.  దాంతో మళ్లీ కెరీర్ కష్టాల్లో పడింది. ఒకదశలో రవితేజతో సినిమాలు తీసేందుకు నిర్మాతలు ముందుకు రాని పరిస్థితి నెలకొంది.  ఈ నేపథ్యంలో యస్.ఆర్. టి. ఎంటర్టైన్మెంట్ పతాకంపై వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో డిస్కోరాజా సినిమాలో నటిస్తున్నాడు. 

ఈ మూవీ సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వస్తుంది. అంతే కాదు ఈ మూవీలో  రవితేజ ప్రయోగాత్మక పాత్రలో నటించబోతున్నారట. రామ్ తాళ్లూరి ఈ మూవీ నిర్మిస్తున్నారు.  ఈ బ్యానర్లో “నేల టికెట్” చిత్రం తర్వాత రవితేజ చేస్తున్న చిత్రమిది. పాయల్ రాజ్ పుత్, నాభ నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వి ఐ ఆనంద్ విభిన్నమైన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఈ మూవీ నిర్మాణం ఎక్కడా కాప్రమైజ్ కాకుండా తీస్తున్నారట.

డిస్కోరాజా గ్యారెంటీగా సూపర్ హిట్ ఫిలిం అవుతోందని చిత్ర యూనిట్లో టాక్ విన్పిస్తోంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని వినాయక చవితి సందర్బంగా సెప్టెంబర్ 2న విడుదల చేయనున్నారు చిత్ర యూనిట్. ఇక మూవీ తాజా షెడ్యూల్ యూరప్ లో జరగనుంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న క్రిస్మస్ కానుకగా వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.  ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.  ఈ సినిమా తనకు మంచి విజయాన్ని ఇస్తుందన్న నమ్మకంతో రవితేజ ఉన్నారట. 


మరింత సమాచారం తెలుసుకోండి: