టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన సాహో సినిమా, రెండు రోజుల క్రితం విపరీతమైన అంచనాల మధ్య రిలీజ్ అవడం జరిగింది. అయితే సినిమా పై తాము పెట్టుకున్న రేంజ్ లో దర్శకుడు సుజీత్ సినిమాను తెరకెక్కించలేదని పలువురు ప్రేక్షకులు సినిమాపై పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా సినిమాలో కేవలం గ్రాఫిక్స్ మాత్రమే కనపడ్డాయని, అలానే ఫస్ట్ హాఫ్ మొత్తం ఎక్కువగా బోరింగ్ గా సాగుతుండగా, హఠాత్తుగా వచ్చే ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండ్ హాఫ్ లో ఏదో ఉందనే ఫీల్ ని ఆడియన్స్ కి కలిగిస్తుందని, 

అయితే సెకండ్ హాఫ్ కూడా ప్రేక్షకుడు ఊహించిన దానికి భిన్నంగా సాగుతూ, ప్రీ క్లైమాక్స్ యాక్షన్ సీన్, చివరిలో వచ్చే క్లైమాక్స్ ట్విస్ట్ తప్పించి అసలు సినిమాలో ఏమి లేదని అంటున్నారు. ఇక ఆడియో పరంగా ఆకట్టుకున్న సాంగ్స్, విజువల్ గా మాత్రం అలరించలేకపోయాయని, అలానే హీరో మరియు హీరోయిన్ల మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ అస్సలు ఆకట్టుకోవని మెజారిటీ ప్రేక్షకులు ఈ సినిమాపై అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ సినిమాకు తొలీ రోజు రూ.130 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్ వచ్చిందని, అలానే మొత్తం రెండు రోజుల్లో కలిపి అన్ని ప్రాంతాల నుండి రూ.205 కోట్ల మేర కలెక్షన్ ని కొల్లగొట్టిందని, సాహో నిర్మాతలు కాసేపటి క్రితం ఒక పోస్టర్ రిలీజ్ చేయడంతో, దానిపై నెటిజన్ల నుండి భిన్నాభిప్రాయాలు వినపడుతున్నాయి. కొందరేమో ఈ సినిమా రెండవ రోజు బాగానే రాబట్టింది అంటుంటే, 

ఎక్కువ మంది మాత్రం, మెజారిటీ ప్రాంతాల్లో రెండవరోజు సాహోకు కలెక్షన్ల పరంగా పెద్ద దెబ్బె పడిందని, ప్రస్తుతం నిర్మాతలు ప్రకటిస్తున్న కలెక్షన్ల ఫిగర్లు ఫేక్ అంటూ వాటిపై తమ స్పందనను కామెంట్స్ రూపంలో తెలియచేస్తున్నారు. అయితే ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్న వివరాల ప్రకారం, సాహో నిర్మాతలు ప్రకటిస్తున్న లెక్కలు చాలా వరకు కరెక్టేనని, అయితే వారు చెప్తున్నట్లుగా సినిమా అంత భారీ మొత్తంలో అయితే కలెక్ట్ చేయలేదని సమాచారం. మరి సాహో విషయమై నిర్మాతలు ప్రకటిస్తున్న ఈ కలెక్షన్ల లెక్కల్తో, అవి ఎంత వరకు వాస్తవం అనే దానిపై ప్రేక్షకుల్లో కొంత గందరగోళం నెలకొని ఉందని అంటున్నారు సినీ విశ్లేషకులు......!!  


మరింత సమాచారం తెలుసుకోండి: