అత్యంత భారీ అంచనాలతో విడుదల అయిన ‘సాహో’  కు మొదటిరోజు మొదటి షో నుండి నెగిటివ్  టాక్ రావడంతో ‘సాహో’ మరో ‘అజ్ఞాతవాసి’ కాబోతోందా అంటూ సందేహాలు వ్యక్త పరిచారు.  దీనికితోడు ‘సాహో’ మూవీ స్క్రీన్ ప్లే పవన్ ‘అజ్ఞాతవాసి’ కి మాతృక అయిన ఫ్రెంచ్ మూవీ లార్గో వించ్ స్క్రీన్ ప్లే లా ఉండటంతో ‘అజ్ఞాతవాసి’ పరిస్థితి ‘సాహో’ కి రాబోతోందా అంటూ ఊహాగానాలు వచ్చాయి.

అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా నిన్నటితో ముగిసిన వీకండ్ తో 260 కోట్లకు పైగా కలక్షన్స్ రాబట్టింది అని వార్తలు వస్తున్నాయి. దీనితో నెగిటివ్ టాక్ తెచ్చుకుని కూడ ‘సాహో’ తన కలక్షన్స్ హవా కొనసాగిస్తూ ఉంటే ఇదే విధమైన నెగిటివ్ టాక్ తెచ్చుకుని పవన్ ‘అజ్ఞాతవాసి’  గతంలో సంక్రాంతి సీజన్ అయినప్పటికీ రెండవ రోజునుండే కలక్షన్స్ లో చతికల పడింది అంటూ అప్పటి  ‘అజ్ఞాతవాసి’ కలక్షన్స్ ను ఇప్పటి ‘సాహో’ తో పోలుస్తూ కొందరు చేస్తున్న కామెంట్స్ పవన్ అభిమానులకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నాయి.

వాస్తవానికి పవన్ కు ఉన్న వీరాభిమానుల సంఖ్య ప్రభాస్ వీరాభిమానుల సంఖ్య కన్నా ఎక్కువ. పవన్ కు అభిమానులు మాత్రమే భక్తులు కూడ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో నెగిటివ్ టాక్ తెచ్చుకున్న ‘అజ్ఞాతవాసి’ సంక్రాంతి పండుగ కలక్షన్స్ పెద్దపోటీ లేకపోయింది అన్న కామెంట్స్ అప్పట్లో వచ్చాయి. 

అయితే దీనికి భిన్నంగా టోటల్ నెగిటివ్ టాక్ తెచ్చుకుని కూడ ‘సాహో’ కలక్షన్స్ విషయంలో పరుగులు తీస్తున్న నేపధ్యంలో కలక్షన్స్ స్టామినా విషయంలో డార్లింగ్ ప్రభాస్ కు పవర్ స్టార్ పవన్ కంటే కలక్షన్ స్టామినా ఎక్కుగా ఉంది అంటూ కొందరు పవన్ వ్యతిరేకులు చేస్తున్న కామెంట్స్ పవన్ అభిమానులకు అసహనాన్ని కలిగిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ‘సాహో’ పై వచ్చిన నెగిటివ్ రివ్యూలను కూడ పట్టించుకోకుండా నిన్నటిరోజున బాలీవుడ్ లో కొనసాగిన ఈ మూవీ ప్రభంజనం బాలీవుడ్ టాప్ హిట్ మూవీస్ ‘కబీర్ సింగ్’ ‘మిషన్ మంగళ్’ మూవీలకు మించి ఉంది అంటూ వస్తున్న వార్తలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: