నందమూరి వంశం అంటేనే మాస్. మరి గణపతి సైతం మరీ మాస్. ఆయన పండుగ వేళ చవితి అయినా ఏదైనా ప్రారంభిస్తే శుభాలే జరుగుతాయని అంటారు. విఘ్నాలను తొలగించే దేవుడు వినాయకుడు. అందువల్ల మిగిలిన చవితుల మాట ఎలా ఉన్నా వినాయచవితి మాత్రం సినీ ప్రియులకు గొప్ప ఆనందం. అటువంటి వినాయకచవితి వేళ హీరో నందమూరి బాలక్రిష్ణ రేర్ ఫీట్ చేశారు.


అది చరిత్రలో నిలిచే ఫీట్. ఇప్పటి వరకూ ఎవరూ కొట్టలేని ఫీట్ కూడా అదే. అది 1993 సంవత్సరం.  బాలయ్య సినిమాలు అప్పటికి విడుదలై దాదాపుగా ఏడాదిన్నర కాలం గడిచిపోయింది. ఫ్యాన్స్ చాలా ఆకలి మీద ఉన్నారు. అప్పటికే బాలయ్య వేగంగా సినిమాలు చేస్తారని పేరు. అలా ఒకేసారి రెండు సినిమాలు పట్టలెక్కించి ఒకేసారి పూర్తి చేశారు. అందులో టాప్ హీరోయిన్ విజయశాంతి నిర్మాతగా ఉన్న యువరత్న మూవీస్ ప్రొడక్షన్ వారిది నిప్పురవ్వ ఒకటి.


మరోటి ప్రఖ్యాత సంస్థ జగపతి ప్రొడక్షన్స్ నుంచి బంగారు బుల్లోడు. ఈ రెండు సినిమాలు ఒకేసారి పూర్తి కావడంతో బాలయ్య సైతం రెండూ ఒకేసారి రిలీజ్ కి ఒకే అనేశారు. ఆ విధంగా రెండు సినిమాలు 1993 సెప్టెంబర్ 3న అంటే వినాయకచవితి రోజున విడుదల అయ్యాయి. రెండూ మాస్ మూవీస్, రెండూ సూపర్ హిట్లు అయ్యాయి.


అందులో బంగారు బుల్లోడు అయితే చాలా పెద్ద హిట్ అయింది. ఓ వూపు వూపేసింది. ఇక నిప్పురవ్వ బాలయ్య కెరీర్లో మరో ఖైదీ అవుతుందని అనుకున్నారు. అయితే ఒకేసారి తన సినిమాలే పోటీ కావడంతో వెనకబడింది. ఏది ఏమైనా ఓ సూపర్ స్టార్ డం ఉన్న హీరో సినిమాలు ఒకేసారి ఒకే రోజు విడుదల కావడం మాత్రం రేర్ ఫీట్. 


ఇప్పటికి 26 ఏళ్ళు గడచినా ఆ ఫీట్ ని ఎవరూ బీట్ చేయలేకపోయారు. కొన్నేళ్ళ క్రితం నాని సినిమాలు రెండు రిలీజ్ అయినా భారీ మూవీస్ స్టార్ సినిమాలు మాత్రం ఒకే డేట్లో రావడం అంటూ ఇప్పటికి జరగలేదు. అది బాలయ్య రికార్డ్ గానే ఉండిపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: