మొదట్లో కొన్ని సినిమాల్లో అక్కడక్కడా చిన్న క్యారెక్టర్స్ లో నటించిన టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ, శ్రీనువైట్ల తెరకెక్కించిన నీకోసం సినిమాతో హీరోగా మారారు, ఆ తరువాత కొన్నాళ్ళకు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలు ఆయనకు హీరోగా మంచి ఇమేజిని తెచ్చిపెట్టాయి. అలానే శ్రీనువైట్ల తో ఆయన చేసిన వెంకీ, దుబాయ్ శ్రీను సినిమాలు కూడా రవితేజకు కెరీర్ పరంగా మంచి సక్సెస్ మరియు పేరు తీసుకురావడం జరిగింది. అయితే మధ్యలో రాజమౌళి దర్శకత్వంలో ఆయన నటించిన విక్రమార్కుడు, వినాయక్ దర్శకత్వంలో నటించిన కృష్ణ సినిమాలు సూపర్ హిట్ సాధించి, 

రవితేజకు తిరుగులేని మాస్ హీరోగా పేరు తీసుకురావడం జరిగింది. ఇక ఇటీవల కొద్దికాలంగా వరుస పరాజయాలతో సతమతం అవుతున్న రవితేజ, ప్రస్తుతం దర్శకుడు విఐ ఆనంద్ దర్శకత్వంలో డిస్కో రాజా అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు. గతంలో ఎక్కడికిపోతావు చిన్నవాడా, ఒక్క క్షణం వంటి విభిన్న స్క్రీన్ ప్లే సినిమాలను తెరకెక్కించి తెలుగు ఆడియన్స్ ను ఆకట్టుకున్న ఆనంద్, ప్రస్తుతం రవితేజతో చేస్తున్న ఈ డిస్కో రాజా సినిమాను కూడా ఒక వెరైటీ కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇక నేడు వినాయక చవితిని పురస్కరించుకుని ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసింది సినిమా యూనిట్. 

ఈ పోస్టర్ లో రవితేజ రెడ్ కలర్ సూట్ వేసుకుని, ఫ్రెంచ్ స్టైల్ గడ్డంతో, గన్ పట్టుకుని ఎంతో స్టైల్ గా నవ్వుతూ ఉన్న ఆ పోస్టర్, ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్, నభ నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాను, నిర్మాత రామ్ తాళ్లూరి, తన ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కాగా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: