బుల్లితెరపై బిగెస్ట్ రియాలిటీ షో గా విరాజిల్లుతున్న బిగ్ బాస్ షో పై ఇప్పుడు అందరూ మండిపడుతున్నారు. దానికి కారణం ఏమిటంటే .. ప్రతి ఆదివారం బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేషన్ అనేది ఉంటుంది, కానీ ఈ వీక్  మాత్రం ఎలిమినేషన్ ఏమి జరగలేదు. గత వారం లో నామినేషన్ లో ఉన్న మహేష్, హిమజ,పునర్నవి ముగ్గురు కూడా సేవ్ అయ్యారు. బిగ్ బాస్ ఈ ఆదివారం ఎలిమినేషన్ లేకుండా చేయడాన్ని ఎవరూ తప్పుపడటం లేదు.  అది గేమ్ లో భాగం అని అనుకోవచ్చు, లేదా బిగ్ బాస్ స్ట్రాటజీ వేరే విధంగా ఉండవచ్చు.

అయితే విత్ అవుట్ ఎలిమినేషన్ అనే ప్రక్రియ చేసిన విధానం ముమ్మాటికీ తప్పే అని చెప్పాలి. గత సీజన్ లో ఒక వారం ఎలిమినేషన్ లేదని బిగ్ బాస్ ముందే చెప్పాడు. ఆ విధంగా ఆడియన్స్ కి చెప్పి ఎలాంటి ఓటు చేయవద్దని తెలిపాడు. కానీ హౌస్ మేట్స్ కి ఎలిమినేషన్ ఉంటుంది అనే చెప్పాడు. హౌస్ మేట్స్ ఎలిమినేషన్ కోసం టెన్షన్ పడుతుంటే దానిని ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. కానీ ఈ సీజన్ లో తాజాగా ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా గత ఐదు రోజులు నుండి ఓటింగ్ నిర్వహించారు. 

కొన్ని లక్షల మంది తమ అభిమాన కాంటిస్టెంట్స్ కోసం కోట్లు ఓట్లు వేశారు. తీరా చివరికి వచ్చేసరికి ఎలిమినేషన్ లేదని చెప్పారు. లేదని ముందే అనుకున్నప్పుడు ప్రేక్షకుల్ని అందుకు రెడీ చేయాలి కదా... ప్రతి రోజు హాట్ స్టార్ లోకి వెళ్లిమరీ ఓట్లు వేసి, ఫోన్ చేసి ఓట్లు వేసిన ప్రేక్షకులు చివరికి బకరాలు అయ్యారు. ప్రేక్షుకులకి త్రిల్ అనేది అవసరమే, కాకపోతే వాళ్ళనే బకరాలు చేసి త్రిల్ గా ఫీల్ అవండి అంటే అది మూర్కత్వమే అవుతుంది. లేదు ముందు మేము ఎలిమినేషన్ ఉంటుంది అనే ఓటింగ్ పెట్టాం, కానీ మధ్యలో మనస్సు మార్చుకున్నామని బిగ్ బాస్ యాజమాన్యం చెపితే దానంట చేతకానితనం మరొకటి లేదని చెప్పవచ్చు.  ఏదేమైనా ప్రేక్షకులని బకరాలని చేసిన బిగ్ బాస్ పై అభిమానులు ఒక రేంజ్ లో రెచ్చిపోతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: