విక్టరీ వెంకటేష్ , యువ సామ్రాట్  నాగ చైతన్య నటిస్తున్న మచ్ అవైటెడ్ మల్టీ స్టారర్ మూవీ  వెంకీమామ మొన్నటి తో షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం  పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.  ఇక ఈచిత్రాన్ని  దసరా బరిలో నిలుపాలనుకున్నారు కానీ అదే సమయంలో  మెగా స్టార్ చిరంజీవి  నటించిన పీరియాడికల్ మూవీ  సైరా  కూడా విడుదలకానున్నడంతో  ఆ సినిమా తో  పోటీఎందుకని వెంకీ మామ వెనక్కి వెళ్ళి పోయిందని ఇటీవల వార్తలు వచ్చాయి.  అయితే ఈ రిలీజ్ డేట్ విషయం లో ఈ రోజు  క్లారిటీ  వచ్చే అవకాశంవుంది. 




ఎందుకంటే  ఈ చిత్రం నుండి  ఈ రోజు  వినాయకచవితి  సందర్భంగా  సాయంత్రం 5:04 గంటలకు  పోస్టర్  విడుదలకానుంది. ఆ పోస్టర్ తో పాటు రిలీజ్ డేట్ ను  ప్రకటించే అవకాశాలు  ఉన్నాయని సమాచారం.   బాబీ డైరెక్షన్ లో కామెడీ ఎంటర్ టైనర్ గా  తెరకెక్కుతున్న ఈ చిత్రంలో  వెంకీ సరసన  హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ నటిస్తుంది.  ఆమె ఈ చిత్రంలో  టీచర్ గా కనిపించనుంది. కాగా  నాగ చైతన్య కు  జోడిగా  రాశీ ఖన్నా నటిస్తుంది.  






సురేష్  ప్రొడక్షన్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ల ఫై సురేష్ బాబు , టిజి విశ్వప్రసాద్  సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.   ఇక ఇటీవల  ఎఫ్ 2 తో  బ్లాక్ బ్లాస్టర్ హిట్ కొట్టి ఫామ్ లోకి రాగ మజిలీ తో నాగ చైతన్య సూపర్ హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. మరి ఇప్పుడు ఈ వెంకీ మామ వీరిద్దరికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: