పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నేడు  తన 48 వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చాలా మంది సినీ ప్రముఖులు మరియు అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియపరిచారు.ప్రస్తుతం ట్విట్టర్ లో #HappyBirthdayPawanaKalyan  అనే హ్యాష్ ట్యాగ్ ఇండియలో టాప్-1 ట్రెండింగ్ లో ఉంది.కేవలం ౩౭ నిమిషాల్లో  దాదాపు పది లక్షలకు పైగా ట్వీట్లూ చేశారు.

మెగాఫ్యామిలీ నుండి అందరు ఆయనను విష్ చేశారు. కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూడు రోజుల ముందే కామన్ డిపి షేర్ చేసి సంబరాలను ప్రారంభించారు.ఈ రోజు పవర్ స్టార్ పుట్టిన రోజు సందర్బంగా ఇన్‌స్టాగ్రామ్ వేదిక గా ప్రేమ పూర్వకమైన పోస్ట్ చేశారు పుట్టినరోజు శుభాకాంక్షలు కల్యాణ్ బాబాయి. ఇక ఫ్రెండ్ గా,ఒక మెంటర్ గా.ఒక గైడ్ గా ఎప్పుడు నాతో ఉన్నందుకు ధన్యవాదాలు.  మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను అని పోస్ట్ చేశారు. ఆయనతో దిగిన రెండు ఫోటోలను కూడా షేర్ చేశారు

రామ్ చరణ్ తనకు పవర్ స్టార్ అంటే చాలా ఇష్టం అని చాలా సందర్బాలలో తెలియపరిచారు. గతంలో నాయక్ సినిమా ఆడియో లాంచ్ లో రామ్ చరణ్ చాలా ఎమోషనల్ అయ్యారు.చిరంజీవి గారి వెనుక బాబాయి ఉంటాడు. కల్యాణ్ బాబాయి వెనుక నేను ఉంటాను. కల్యాణ్ బాబాయి దగ్గరికి వెళ్లాలంటే నన్ను దాటి వెళ్లాలి.

నా ఆడియో ఫంక్షన్ కు కల్యాణ్ బాబాయి వస్తే నే మేము కలిసి ఉన్నాట్టా .నన్ను కల్యాణ్ బాబాయి ఎంత ప్రేమిస్తాడో నాకు తెలుసు నేను బాబాయిని ఎంత ప్రేమిస్తానో బాబాయికి తెలుసు.మా ప్రేమను  ఎవరికి మేము చెప్పుకోవలన అవసరంలేదు అని మాట్లాడడు.వరుణ్ తేజ్ ట్విట్టర్ వేదికగా టీం వాల్మికి నుండి పవర్ స్టార్ కు పుట్టిన రోజు  శుభాకాంక్షలు . ఎలాంటి పరిస్థితుల్లోనూ మీతోనే ఉంటాను అని ట్విట్ చేశాడు.  



మరింత సమాచారం తెలుసుకోండి: