మూడు రోజుల క్రితం విడుదలైన సాహో సినిమాకు క్రిటిక్స్ నుండి నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. ప్రభాస్ ఫ్యాన్స్ సినిమా హిట్ అని చెబుతున్నప్పటికీ సాధారణ ప్రేక్షకులకు మాత్రం సాహో సినిమా నచ్చలేదు. కథ, కథనంలోని లోపాలు, సంగీతం, సినిమా నిడివి, విజువల్ ఎఫెక్ట్స్ సరిగా లేకపోవటం వలన సాహో సినిమా చూసిన ప్రేక్షకులు నిరాశకు గురయ్యారు. సాహో సినిమా ప్లాప్ కావటానికి ప్రభాస్ ఇమేజ్ కూడా కారణమని తెలుస్తోంది. 
 
సుజీత్ మొదటి సినిమా రన్ రాజా రన్ తో హిట్ కొట్టిన తరువాత సాహో సినిమా కథను ప్రభాస్ కు వినిపించాడు. ఈ సినిమాను సుజీత్ 50 నుండి 60 కోట్ల బడ్జెట్ తో తీయాలని అనుకున్నాడు. కానీ ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా విడుదలవటం, ఇండస్ట్రీ హిట్ కావటంతో సాహోలో మార్పులు చేర్పులు జరిగాయి. ప్రభాస్ ఇమేజ్ పెరగటంతో నిర్మాతలు సాహో సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించటానికి సిధ్ధం అవటంతో సాహో కథలో మార్పులు జరిగాయని సమాచారం. 
 
కథలో మార్పులు చేయటం వలన సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్సులు వచ్చాయని, అనవసరమైన పాత్రలు కథలో చేర్చారని, కథలో మార్పులు చేయటం వలనే సాహో సినిమాకు ప్లాప్ టాక్ వచ్చిందని తెలుస్తోంది. సాహో సినిమాను లిమిటెడ్ బడ్జెట్లో తీసి ఉంటే మాత్రం నిర్మాతలకు ఈ సినిమా ద్వారా భారీగా లాభాలు వచ్చే అవకాశం ఉండేది. నిన్నటివరకు సాహో సినిమాకు కలెక్షన్లు బాగానే వచ్చాయి. 
 
ఈరోజు కూడా సెలవు కావటంతో సినిమాకు కలెక్షన్లు బాగానే వచ్చే అవకాశం ఉంది. రేపటి నుండి వర్కింగ్ డేస్ కావటంతో సాహో ఏ మేరకు కలెక్షన్లను సాధిస్తుందో చూడాలి. ఓవర్సీస్లో సాహో సినిమా 2 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ ఈ సినిమాను భారీ రేటుకు కొన్నారు. ఓవర్సీస్లో మాత్రం ఈ సినిమాలు భారీ నష్టాలు రావటం ఖాయమని తెలుస్తోంది. బాలీవుడ్లో మాత్రం సాహో సినిమాకు కలెక్షన్లు బాగానే వస్తూ ఉండటం విశేషం. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: