ఒకప్పుడు సినిమాలంటే ఎలావుండేవి.ఫ్యామిలీతో వెళ్ళినా ఇబ్బంది కలుగకుండా అందరు ఆనందంగా చూసేలా నిండు కుండలావుండేవి.నటీమణులు,నిండైన కట్టుబొట్టుతో,అణుకువకలిగిన ఒద్దికతో,చూడగానే అమ్మనో,చెల్లలో గుర్తొచ్చేలా వుండే వారు.అంగప్రదర్శన గాని,అందప్రదర్శనగాని కనిపించేది కాదు.మరి ఇప్పుడు మారిన కల్చర్‌లో బోల్డ్ అనేపదానికి ఎక్స్‌టెన్షన్ ఇచ్చి హీరోయిన్స్‌తో యథేచ్ఛగా బూతులు మాట్లాడించడం ఎక్కువైపోతోంది.ఆకాలంలో కథానాయిక అనే పదానికి సినిమాల్లో చాలా ప్రాధాన్యత,ప్రాముఖ్యత ఉంటుంది.కానీ,ఇది ఒక్కప్పటి మాట.ఇప్పుడు మాత్రం హీరోయిన్ అంటే కేవలం అందాల ఆరబోతకు పరిమితం అవుతున్నారు అనేది పచ్చినిజం.



ఇప్పుడున్న హీరోయిన్లలో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటించే కొద్ది మందిలో,సమంత,అనుష్క,నయనతార,కీర్తి సురేష్,సాయి పల్లవి లాంటి వాళ్ళను ఉదాహరణలుగా చూపించవచ్చు.కానీ వీళ్ళలో ఎక్కువమంది కెరీర్ చరమాంకంలో ఉన్నారు.పైగా వాళ్ళు తమ పర్సనల్‌ లైఫ్‌ని కూడా బ్యాలన్స్ చేసుకోవడానికి వచ్చిన సినిమాల్లో నుండి తమకి నచ్చిన పాత్రలు మాత్రమే ఎంచుకుని నటిస్తున్నారు.ఇలా అందరికి ఉండే అవకాశం లేదు. ఈ మధ్య కాజల్ కూడా దాదాపు ఎక్స్‌ పోజింగ్ చెయ్యడానికి అభ్యంతరం చెప్పడంలేదు.కెరీర్ ఎండ్‌కి వచ్చిందని గుర్తించిందేమో ఆమెనటించిన ‘క్వీన్’ తమిళ్ రీమేక్‘పారిస్‌ పారిస్’లో సీన్స్అయితే సెన్సార్ కత్తెరకి బలైపోయాయి.ఐతే అవి కట్ చేసినందుకు కాజల్ ఫీల్ అవ్వడం అసలు హైలైట్.



పూజాహెగ్డే ఇంతకు ముందు,ముకుంద,ఒక లైలా కోసం.సినిమాల్లో పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ మాత్రమే చేసింది.కానీ అప్పుడు గుర్తింపు,అవకాశాలు రెండు రాలేదు. ఎప్పుడైతే ఈ దేహం తనది కాదని ‘DJ’సినిమాలో  మొహమాటపడకుండా బికినీ వేసి మరీ అందాల ప్రదర్శన చెయ్యడంతో ఆ సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా వరుసగా అగ్రహీరోల సరసన నటించే అవకాశాలు వచ్చాయి.ఇక ఇప్పుడు టాప్ హీరోయిన్‌గా వెలిగిపోతున్న రష్మిక కూడా ముందు‘ఛలో’సినిమాలో డీసెంట్‌గా కనిపించింది.అప్పుడు ఆమె ఎవ్వరికీ పెద్దగా నచ్చలేదు.‘గీత గోవిందం’లో విజయ్ దేవరకొండ‌తో రెండు ఘాటు లిప్ లాక్స్ చేసేసరికి అంతా ఆమెపై ఫోకస్ చేసారు.హీరోయిన్ ఎవరయినా కూడా అందాల విందు చేస్తేనే ఆఫర్లు వెల్లువెత్తుతాయనేది దీన్ని బట్టి తెలుస్తుంది.



ఇక అందర్ని పాగల్‌ని చేస్తున్న పాయల్‌రాజ్‌పుత్ పదడుగులు ముందేసి ఎవడుచూస్తే నాకేంటి అనే రేంజ్‌లో తనలోని ఒక్కటి తప్పా అన్ని ప్రదర్శిస్తూ‘RX 100’సినిమా హిట్ అవ్వడానికి కారణం అయ్యింది.ఈ సినిమాలో పాయల్ రాజపుత్ హీరోతో కలిసి పండించిన రొమాన్స్ కూ వందకు వంద మార్కులు వేసారు.అయితే ఆ సినిమా తరువాత ఆమెకు మళ్ళీ అదే తరహా సినిమాలు,అదే తరహా రోల్స్ వచ్చాయి.చాలా కాలం వాటిని వద్దనుకుంటూ వచ్చిన పాయల్ చివరికి అదే తరహా రోల్ చెయ్యక తప్పలేదు.‘RX 100’లోనే ఆమె ఎక్స్‌పోజింగ్ హద్దులు దాటింది అనుకుంటే..ఇప్పడు చేస్తున్న RDX లవ్ అయితే బూతుకు మారుపేరులా,ఇంకా చెప్పలంటే ఓ బ్లూ ఫిలింలా ఉందంటున్నారు చూసిన వాళ్లు. ఇక ఇప్పుడున్న పరిస్దితుల్లో.మహానటి, యూ టర్న్,ఓ బేబీ,కర్తవ్యం,లాంటి సినిమాలు వేళ్ళమీద లెక్కేయ్యవచ్చు.కానీ హీరోయిన్స్ అందాలని,వాళ్ళ బోల్డ్ సీన్స్‌ని నమ్ముకుని తెరకెక్కే సినిమాలు మాత్రం బోలెడన్ని వచ్చాయి, వస్తున్నాయి.హీరోయిన్ అంటే ఎక్స్‌పోజింగ్ చెయ్యాలి అనేది తప్పనిసరిగా మారింది.ఈ కల్చర్లో సాగుతున్న ఈ ట్రెండ్‌కి ఇప్పట్లో బ్రేక్స్ పడే అవకాశం లేదనిపిస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: