మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం డిస్కోరాజా. సెప్టెంబర్ 2న వినాయక చవితి సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. అలానే సెప్టెంబర్ 3 నుంచి గోవాలో కీలకమైన షెడ్యూల్ ప్లాన్ చేశారు. మరోవైపు డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.


ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని క్రిస్ మస్ కానుకగా డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాత రామ్ తాళ్లూరి ప్రకటించారు. మహారాజా రవితేజ, వి ఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రామ్ తాళ్లూరి నిర్మాణంలో, సాయి రిషిక సమర్పణలో, రజిని తాళ్లూరి ఈ చిత్రాన్ని గ్రాండియర్‌గా నిర్మిస్తున్నారు. 


ఈ సందర్భంగా నిర్మాత రామ్ తాళ్లూరి మాట్లాడుతూ... ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు, ఈ  రోజు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ మాస్ రాజా రవితేజ ఫాన్స్ కి మంచి కిక్ ఇచ్చేలా ఉంది అని భావిస్తున్నాను, ఈ లుక్ కి వంద రెట్లు కిక్ ఇచ్చే విధంగా ఫుల్ మాస్ అండ్ క్లాస్ ఎంటెర్టైనెర్ గా డిస్కోరాజా ని రెడీ చేస్తున్నారు మా దర్శకుడు వి ఐ ఆనంద్. ఇక మా బ్యానర్లో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేయనున్నాం. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్, ఢిల్లీలోని విభిన్నమైన ప్రాంతాల్లో, లొకేషన్స్ లో షూటింగ్ చేశాం. పాయల్ రాజ్ పుత్, నభా నటేష్, తాన్యాహోప్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.


ఈ చిత్రాన్ని భారీ హాంగులతో, గ్రాఫిక్స్ కి పెద్దపీట వేసి నిర్మిస్తున్నాం. థమన్ మ్యూజిక్, అబ్బూరి రవి డైలాగ్స్, కార్తీక్ ఘట్టమనేని గ్రాండియర్ విజువల్స్, ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర పనితనం, నవీన్ నూలి ఎడిట్ ఈ సినిమాకు ఎంతో ప్లస్ అవుతున్నాయి. ఇక వెన్నెల కిషోర్ హిలేరియస్ కామెడీ తో ప్రేక్షకులకు నవ్వుల విందు పంచనున్నాడు, బాబీ సింహా ఈ సినిమాకు మరో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తారు. టైటిల్ కు తగ్గట్టుగా డిస్కోరాజా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తుందని ధీమాగా చెప్పగలం.. అని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: