బుల్లితెర బిగెస్ట్ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ఆరువారాలని కంప్లీట్  చేసుకుంది. ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ నుండి  ఐదు మంది హౌస్ మేట్స్  బయటకి వెళ్లిపోయారు. అలాగే  ఈ వారం నాగ్ తన పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా ఫారెన్ లో ఉండటం తో అయన స్థానంలో టాలీవుడ్ క్వీన్ రాణి శివగామిదేవి రమ్యకృష్ణ ఎంట్రీ ఇచ్చి బిగ్ బాస్ ని ఒక ఊపు ఊపేసింది. అలాగే వినాయకచవితి సందర్భంగా ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు అని చివరి వరకు టెంక్షన్ పెట్టినప్పటికీ ... చివర్లో ఈ వారం ఎలిమినేషన్ లేదు అని నామినేషన్స్ లో ఉన్న ముగ్గురుని సేవ్ చేసి హౌస్ ని మరింత సందడిగా మార్చేసింది.

ఇక ఏడోవారం మొదలుకాగానే  .... బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియని స్టార్ట్ చేసాడు. గత వారాలకంటే చాలా బిజీగా ఈ వారం నామినేషన్స్ జరిగాయి. ఇద్దరిద్దరిని కన్ఫెషన్ రూమ్ కి పిలిచి ..ఒక మిస్టరీ ఫ్రెండ్ తో నామినేషన్స్ ని జరిపించాడు. మిస్టరీ ఫ్రెండ్ గా శిల్పా చక్రవర్తి పేస్ కనిపించకుండా ...నీడలా కనిపిస్తుంది అందరితో మాట్లాడుతూ నామినేషన్ ప్రోసెస్ ని పూర్తి చేసింది. ఈ ప్రోసెస్ లో శ్రీముఖి , బాబా భాస్కర్ ఆ మిస్టరీ ఫ్రెండ్ తో కూడా ఒక అట ఆదుకున్నారు. బిగ్ బాస్ చెప్తేనే వినలేదు ..నువ్వు చెప్తే వింటామా అన్నట్టుగా రెచ్చిపోయారు. నామినేషన్ ప్రక్రియ పూర్తి కాగానే ...శిల్పా చక్రవర్తి ని వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్లోకి పంపించాడు. హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన రెండు సెకన్స్ కే  శిల్పా కి షాక్ ఇచ్చాడు. మీరు నామినేట్ చేయాలనుకున్న రెండు పేర్లని చెప్పాలని చెప్పాడు.ఇక ఈ  ఏడో వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి  వెళ్ళడానికి అలీ రెజా , రవి , రాహుల్ సిప్లిగంజ్ , మహేష్ , శ్రీముఖి నామినేట్ అయినట్టు ప్రకటించాడు.  

ఇక తాజాగా వచ్చిన ప్రోమోని ఒకసారి చూస్తే .... గత సీజన్స్ లానే ఈ సీజన్ లో కూడా బిగ్ బాస్ హౌస్లోకి స్టోర్ రూమ్ లో నుండి ఒక్కసారిగా హౌస్లోకి దొంగలు ఎంట్రీ ఇచ్చారు. హౌస్లో  లోకి దొంగలు వచ్చి  కిచెన్ లో ఉన్న సరుకులు, గార్డెన్ లోని బట్టలు , చెప్పులు తీసుకునివెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టు ప్రోమో చూస్తే అర్థమౌతుంది. దొంగలు ఆలా హౌస్లోకి ఎంట్రీ ఇవ్వగానే ... అలర్ట్ అయిన హౌస్ మేట్స్ దొంగలకు కూడా భయం అంటే ఏంటో చూపించారు. హౌస్లో ఉన్న దొంగలు ఇంటి నుండి ఏ సామాన్లు తీసుకోని పోకుండా అవుతున్నారు.   మహేష్ , రాహుల్ కలిసి ఒక దొంగని పట్టుకున్నట్టు అర్తమవుతుంది.  . హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన దొంగల గురించి శ్రీముఖి మాట్లాడుతూ మీకు కొంచెం కూడా ధమాక్ లేదా ..ఆలా ఎలా దొంగతనం చేస్తారు అంటూ ఫైర్ అయ్యింది. ఏందిరా ..ఒరేయ్ ..ఒరేయ్ అంటూ దొంగలని సైతం భయపెట్టి పరిగెత్తేలాచేస్తుంది.  హౌస్లో నుండి దొంగలుఈ ఏమేమి తీసుకుపోయారో తెలియాలి అంటే మీరు తరువాత ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..


మరింత సమాచారం తెలుసుకోండి: