బాహుబలి తర్వాత ప్రభాస్ హీరోగా సుజీత్ డైరక్షన్ లో వచ్చిన భారీ బడ్జెట్ మూవీ సాహో. యువి క్రియేషన్స్ వారు 350 కోట్లు బడ్జెట్ కేటాయించి మరి తీసిన ఈ సినిమా ఆడియెన్స్ ను అలరించడంలో విఫలమైంది. లాస్ట్ ఫ్రైడే రిలీజైన సాహో మొదటి షో నుండి డివైడ్ టాక్ తెచ్చుకుంది. సినిమా మేకింగ్, విజువల్స్, యాక్షన్ పార్ట్ అంతా సూపర్ అనిపించినా అసలైన కథ మాత్రం నిరాశపరచింది.


అయితే తెలుగు రెండు రాష్ట్రాలతో పాటుగా బాలీవుడ్ లో సాహో సినిమా వసూళ్లు బాగానే ఉన్నాయి. డివైడ్ టాక్ సినిమా కలక్షన్స్ మీద ప్రభావం చూపించలేదు. బాలీవుడ్ లో అయితే 3 రోజుల్లో 70 కోట్ల షేర్ తెచ్చి మరోసారి అక్కడ ప్రభాస్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది. ఇక నైజాంలో కూడా 4 రోజుల్లో పాతిక కోట్లు దగ్గరగా వసూళ్లు తెచ్చింది సాహో. 


ఇదిలాఉంటే సాహో తమిళనాట మాత్రం డిజాస్టర్ అంటున్నారు. ఈ సినిమా కోసం సూర్య బందోబస్తు సినిమాను వాయిదా వేసుకున్నాడు. అయినా కూడా సాహో తమిళ తంబీల మనసులు గెలవలేదు. బాహుబలి తర్వాత ప్రభాస్ తమిళ ఆడియెన్స్ ను మెప్పించడంలో విఫలమయ్యాడు. అంతేకాదు సాహో కేరళలో కూడా నష్టాలు తెచ్చేలా ఉంది.


తమిళనాడులో ఈ సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్స్ కు 60 శాతం వరకు నష్టాలు తప్పేలా లేదని తెలుస్తుంది. తెలుగు సినిమాలకు కేరళలో మంచి మార్కెట్ ఉంటుంది. అక్కడ కూడా సాహో చూసిన ఆడియెన్స్ పెదవి విరిచారు. ఓవర్సీస్ లో కూడా 2 మిలియన్ మార్క్ క్రాస్ చేసిన సాహో 5 మిలియన్ డాలర్స్ సాధించడం కష్టమే అంటున్నారు. మొత్తానికి సాహోతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా పూర్తి సక్సెస్ అవడంలో విఫలమయ్యాడని చెప్పొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: