‘సాహో’ ఫలితం ప్రస్తుతం ఎడిటింగ్ స్టేజ్ లో రిలీజ్ కు రెడీ అవుతున్న ‘సైరా’ కలవర పెడుతున్నట్లు టాక్. తెలుస్తున్న సమాచారం మేరకు ‘సైరా’ నిడివి కూడ మూడు గంటలు వచ్చింది. వాస్తవానికి ఈ మూవీ నిడివి మూడు గంటల పదిహేను నిముషాలు రావడంతో ఈ మూవీ నిడివిని ఇప్పటికే ఈ మూవీ నిడివి పదిహేను నిముషాలు తగ్గించారు. 

అయితే ‘సాహో’ పరాజయంలో పెరిగి పోయిన నిడివి కూడ ఒక కీలక పాత్ర పోషించడంతో ఇప్పుడు ‘సైరా’ ను మరో పదిహేను నిముషాలు తగ్గించి 2 గంటల 45 నిముషాల మూవీగా మారిస్తే ఎలా ఉంటుంది అన్న ఉద్దేశ్యంలో చిరంజీవి రామ్ చరణ్ లు ఉన్నట్లు టాక్. ‘సాహో’ కు కథ లేకపోవడం ఒక సమస్య అయితే ‘సైరా’ కథ ఉత్తరాది ప్రేక్షకులకు తెలియని కథ. 

వాస్తవానికి ‘ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి’ పేరు తెలుగు వారికి కూడ పూర్తిగా తెలియదు. ఇలాంటి పరిస్థితులలో అసలు ఉయ్యాలవాడ పేరు కూడ తెలియని ఉత్తరాది ప్రేక్షకులకు ‘సైరా’ సినిమాను మూడు గంటలు చూడమంటే చూడరేమో అన్న సందేహాలు మెగా కాంపౌండ్ కు వస్తున్నట్లు తెలుస్తోంది. 

దీనితో ఆద్యంతం ఉద్వేగంగా నడిచే ఈ మూవీని 2 గంటల 45 నిముషాలకు కుదించడం ఇప్పుడు ‘సైరా’ యూనిట్ కు ఓఅక సమస్యగా మారింది అని అంటున్నారు. ‘సాహో’ అనుకున్న విధంగా సూపర్ సక్సస్ అయి ఉంటే ‘సైరా’ విషయంలో ఎటువంటి అనుమానాలు చిరంజీవి చరణ్ లకు వచ్చి ఉండేవి కావు. అయితే ఇప్పుడు ‘సాహో’ ఫెయిల్ అవ్వడంతో ఈ మూవీ ఏ విషయంలో ఫెయిల్ అయింది అన్న తీవ్ర పరిశోధనలో ప్రస్తుతం మెగా కాంపౌండ్ ఉండటమే కాకుండా ‘సాహో’ లో జరిగిన పొరపాట్లు ‘సైరా’ లో జరగకూడదు అన్న తీవ్ర ఒత్తిడిలో ఇప్పుడు చిరంజీవి చరణ్ లు ఉన్నట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: