ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. జనసేన పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు వినాయక చవితి పండుగ తో తమ అభిమాన అతడు పుట్టినరోజు వేడుకలు కూడా గట్టిగా చేశారు. సోషల్ మీడియాలో అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు రచ్చ రచ్చ చేసి బర్తడే నాడు హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో పవన్ కళ్యాణ్ హ్యాపీ బర్తడే మొదటి స్థానంలో నిలబెట్టారు. ఇటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తో గతంలో ఎస్ జె సూర్య దర్శకత్వంలో 'కొమరం పులి' లో హీరోయిన్ గా నటించిన నికీషా పటేల్ పవన్ కి బర్త్ డే విషెష్ తెలుపుతూ పొరపాటున రాంగ్ హ్యాష్ ట్యాగ్ జత చేసింది. పవన్ కళ్యాణ్ కి బదులుగా పావల కళ్యాణ్ అని హ్యాష్ ట్యాగ్ జతచేయటం జరిగింది.


దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆ హీరోయిన్ పై రెచ్చిపోయారు ఆగ్రహంతో ట్రోల్ చేయడం ప్రారంభించారు. మీడియాలో కూడా ఈ వార్త హైలైట్ అయింది. వెంటనే స్పందించిన నికీషా పొరపాటున ఆ హ్యాష్ ట్యాగ్ జత చేశానని, కొంతమంది ఇడియట్స్ ఆ హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేయడం వల్లే పొరపాటు జరిగిందని వివరణ ఇచ్చింది. వివరణ ఇవ్వడంతో పవన్ కళ్యాణ్ అభిమానులను మీడియా సైలెంట్ అవ్వాలని కోరింది.


ఇదే క్రమంలో నికీషా.. పవన్ కళ్యాణ్ పై తనకి గౌరవం ఉందని అవమాన పరచాలనే ఉద్దేశం తనకు లేదని పేర్కొంది. ఈ మొత్తం వివాదంపై మరో హీరోయిన్ పూనమ్ కౌర్ స్పందిస్తూ నికీషా పటేల్ కు మద్దత్తు తెలిపింది. 'నికీషా ఎవరి కోసమో నువ్వు నీ నిజాయతీని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. గతంలో కూడా నువ్వు ఓ మీడియా వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నావు. ఈ నెగిటివిటీని పట్టించుకోవద్దు అని నికీషాకు పండగ పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా పూనమ్ కౌర్ ఈ విషయంలో స్పందించింది. మరి పూనం కౌర్ పై పవన్ కళ్యాణ్ అభిమానులు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: