డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున, సోనూ సూద్ నటించిన ‘సూపర్’ సినిమాతో పరిచయం అయ్యింది బెంగుళూరు బ్యూటీ అనుష్క శెట్టి.  మొదటి సినిమా సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీలో అనుష్క చాలా హాట్ హాట్ గా కనిపించడంతో వెంటనే ఆమెకు చాన్సులు రావడం మొదలయ్యాయి.  వరుసగా స్టార్ హీరోల నటించే ఛాన్స్ వచ్చింది.  రాజమౌళి-రవితేజ కాంబినేషన్ లో వచ్చిన విక్రమార్కుడు సినిమాలో అనుష్క గ్లామర్ కి ఫిదా అయ్యారు.

ఇలా వరుస విజయాలతో తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోల సరసన నటిస్తూ వరుస విజయాలు అందుకుంది.  అతి తక్కువ కాలంలోనే నెంబర్ వన్ హీరోయిన్ రేస్ లోకి వెళ్లింది అనుష్క. అలాంటి సమయంలోనే కోడి రామకృష్ణ దర్శకత్వంలో ‘అరుంధతి’ సినిమాలో నటించింది.  ఈ మూవీ అనుష్కకు నటనకు అన్ని వర్గాల ప్రేక్షకులు ఫిదా అయ్యారు.  అప్పటి నుంచి అనుష్క గ్లామర్ పాత్రలు పక్కనబెట్టి ప్రయోగాత్మక పాత్రలకు ప్రాధాన్యత ఇవ్వడం మొదలు పెట్టింది. 

ఈ నేపథ్యంలోనే సైజ్ జీరో కోసం తాను ఫిజికల్ గా ఎన్నో కష్టాలు పడింది.  అప్పటి నుంచి అనుష్క శరీరంలో ఎన్నో మార్పులు రావడం..తర్వాత సన్నబడటం కోసం ఎన్నో కష్టాలు పడుతూ వచ్చింది.  బాహుబలి 2 తర్వాత భాగమతి సినిమాలో నటించిన అనుష్క నెక్ట్స్ సినిమా కోసం చాలా గ్యాప్ తీసుకుంది. ప్రస్తుతం సైలెంట్ సినిమాలో నటిస్తుంది. ఈ మూవీ యుఎస్ లో ఎక్కువభాగం షూటింగ్ జరిగింది. యుఎస్ షెడ్యూల్ ఇటీవలే పూర్తయింది. అయితే ఈ మూవీలో అనుష్క చాలా గ్లామర్ తో పాటు సన్నగా కనిపించబోతుందని తెగ వార్తలు వచ్చాయి.

కానీ అనుష్క మాత్రం బొద్దుగా మారింది. ఆ మద్య అనుష్క నేచర్ కేర్ ట్రీట్ మెంట్ తీసుకుందని..దాని వల్ల చాలా సన్నబడిందని వార్తలు వచ్చాయి. యూఎస్ లో షూటింగ్ పూర్తయిన తర్వాత  ఇటీవల అనుష్క హైదరాబాద్ కు తిరిగొచ్చింది. విమానాశ్రయంలో అనుష్క కనిపించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అనుష్క మళ్ళీ బొద్దుగా మారినట్లు ఉన్న ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: